09-03-2025 12:58:41 AM
నందమూరి కళ్యాణ్‌రామ్ హీరోగా ఓ యాక్షన్ థ్రిల్లర్ రూపొందుతోంది. ఇప్పటివరకు ‘ఎన్‌కేఆర్21’ అనే మేకింగ్ టైటిల్‌తో ప్రచారంలో ఉందీ చిత్రం. ఇందులో సీనియర్ నటి విజయశాంతి ఐపీఎస్ ఆఫీసర్‌గా పాత్రలో నటిస్తున్నారు. సాయి మంజ్రేకర్ హీరోయిన్ కాగా, సోహైల్‌ఖాన్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. శ్రీకాంత్, ‘యానిమల్’ పృథ్వీరాజ్ ఇందులో కీలక పాత్రలను పోషిస్తున్నారు.
ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై అశోక్‌వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మిస్తునారు. మహిళా దినోత్సవం సందర్భంగా మేకర్స్ ఈ సినిమా టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు. చిత్రం పేరును ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’గా వెల్లడిస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ టైటిల్ అనౌన్స్‌మెంట్ పోస్టర్ కళ్యాణ్ రామ్, విజయశాంతి పాత్రలను ఇంటెన్స్ డైనమిక్‌గా ప్రజెంట్ చేస్తోంది.
ఇప్పటికే టాకీ పార్ట్ పూర్తి చేసుకుందీ సినిమా. మిగతా పనులు పూర్తయిన తర్వాత విడుదల తేదీని ప్రకటిస్తామని మేకర్స్ ఈ సందర్భంగా తెలిపారు. ఈ చిత్రానికి డీవోపీ: రామ్ ప్రసాద్; సంగీతం: అజనీష్ లోక్‌నాథ్; ఎడిటర్: తమ్మిరాజు; ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి; యాక్షన్: రామకృష్ణ, పీటర్ హెయిన్; స్క్రీన్ ప్లే: శ్రీకాంత్ విస్సా.