హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) 10 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. 2021,2022 బ్యాచ్ ఐపీఎస్ అధికారులను బదిలీ(IPS Officers Transfer) చేస్తు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి(CS Shanthi Kumari) ఉత్తర్వులు జారీ చేశారు.
బదిలీ అయిన ఐపీఎస్ అధికారులు వీరే...
ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్ ఏఎస్పీగా కాజల్(2021),
రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని భువనగిరి ఏఎస్పీగా కంకణాల రాహుల్ రెడ్డి(2021),
ఆసిఫాబాద్ ఏఎస్పీగా చిత్తరంజన్(2022),
కామారెడ్డి ఏఎస్పీగా బొక్కా చైతన్య రెడ్డి(2022),
జనగామ ఏఎస్పీగా పందిరే చైతన్య నితిన్(2022),
భద్రాచలం ఏఎస్పీగా విక్రాంత్ కుమార్ సింగ్,
కరీంనగర్ రూరల్ ఏఎస్పీగా నగ్రాలే శుభం ప్రకాశ్(2022),
నిర్మల్ ఏఎస్పీగా రాజేశ్ మీనా(2022),
దేవరకొండ ఏఎస్పీగా పీ మౌనిక(2022) బదిలీ అయ్యారు.
డీజీపీ కార్యాలయాలనికి అంకిత్ కుమార్ ను అటాచ్ చేస్తూ సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వుల జారీ చేశారు.