గ్రేహౌండ్స్ అధికారులకు స్థానచలనం
హైదరాబాద్, డిసెంబర్ 30 (విజయక్రాంతి): రాష్ట్రంలో పది మంది ఐపీఎస్‌లు బదిలీ అయ్యారు. సోమవారం సీఎస్ శాంతికుమారి ఉత్తర్వు లు జారీ చేశారు. బదిలీ అయిన వారి లో ఇద్దరు 2021 బ్యాచ్‌కు, ఎనిమిది మంది 2022 బ్యాచ్‌కు చెందిన వారు ఉన్నారు. తాజా బదిలీల్లో అందరూ గ్రేహౌండ్స్ అధికారులే కావడం గమనార్హం.
ప్రస్తుతం గ్రేహౌండ్స్ ఏఎస్పీ గా ఉన్న కాజల్‌ను ఉట్నూర్ ఏఎస్పీ గా, కంకణాల రాహుల్‌రెడ్డిని భువనగిరి ఏఎస్పీగా, ఎస్ చిత్తరంజన్‌ను ఆసి ఫాబాద్ ఏఎస్పీగా, పండారే చేతన్ నితిన్‌ను జనగామ ఏఎస్పీగా, బొక్కా చైతన్యరెడ్డిని కామారెడ్డి ఏఎస్పీగా, విక్రాంత్‌కుమార్ సింగ్‌ను భద్రాచలం ఏఎస్పీగా ప్రభుత్వం బదిలీ చేసింది.
ప్రస్తుతం భద్రాచలం ఏఎస్పీగా ఉన్న అంకిత్ కుమార్‌ను డీజీపీ ఆఫీస్‌లో రిపోర్టు చేయాలని ఆదేశించింది. నగ్రాలే శుభం ప్రకాశ్‌ను కరీంనగర్ రూరల్, రాజేశ్ మీనాను నిర్మల్, పీ మౌనికను దేవరకొండ ఏఎస్పీలుగా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.