calender_icon.png 11 January, 2025 | 1:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు ప్రమాదంలో ఐపీఎస్ మృతి

03-12-2024 03:07:34 AM

  1. కర్ణాటకలో తొలి పోస్టింగ్ కోసం వెళ్తుండగా దుర్ఘటన

బెంగళూరు, డిసెంబర్ 2: కర్ణాటకలో దారుణం చోటు చేసుకుంది. ఐసీఎస్ శిక్షణ పూర్తి చేసి తొలి పోస్టిం గ్ తీసుకోవడానికి వెళ్తూ యువ ఐపీఎస్ అధికారి సోమవారం రోడ్డు ప్రమాదం లో మృతి చెందాడు. మధ్యప్రదేశ్‌కు చెందిన 26 ఏళ్ల హర్ష్‌వర్ధన్ కర్ణాటక క్యాడర్‌కు చెందిన 2023 ఐపీఎస్ బ్యాచ్ అధికారి.

హసన్ హైవేలోని కిట్టనే సరిహద్దు సమీపంలో హర్ష్ ప్రయాణిస్తున్న వాహ నం టైర్ ఒక్కసారిగా పోలిపోయింది. దీంతో వాహనం అదుపుతప్పి ఓ ఇం టిని, చెట్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో హర్ష్ తలకు తీవ్రగాయం కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొం దుతూ ప్రాణాలు విడిచారు. ఆయన మృతిపై కర్ణాటక సీఎం సిద్ధారామయ్య ప్రగాఢ సానుభూతి తెలిపారు.