calender_icon.png 23 December, 2024 | 5:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూ.1.60 లక్షల కోట్లు సమీకరించిన ఐపీవోలు

23-12-2024 12:25:34 AM

న్యూఢిల్లీ, డిసెంబర్ 22: సానుకూల మార్కెట్ పరిస్థితులు, ఆర్థికాభివృద్ధి, రెగ్యులేటరీ వ్యవస్థ మెరుగుదల తదితర అంశాలతో ఈ 2024 సంవత్సరంలో వివిధ కంపెనీలు ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్లు (ఐపీవోలు) జారీచేసి రూ.1.60 లక్షల కోట్లు సమీకరించాయి. దేశంలో ఇప్పటివరకూ ఎన్నడూలేనంత భారీ ఐపీవోను హ్యుందాయ్ మోటార్ ఇండియా ఈ ఏడాది జారీచేసింది.

ఈ కంపనీ పబ్లిక్ ఆఫర్ ద్వారా రూ. 27,870 కోట్లు సమీకరించింది. ఎక్సేంజీల గణాంకాల ప్రకారం 2024లో 90 పబ్లిక్ ఇష్యూలు కలిపి రూ.1.60 లక్షల కోట్లు సమీకరించా యి. వీటికి తోడు వొడాఫోన్ ఐడియా ఫాలో ఆన్ ఆఫర్ (ఎఫ్‌పీవో) ద్వారా రూ. 18,000 కోట్లు సేకరించింది. ఈ సంవత్స రం మార్కెట్లోకి వచ్చిన ఐపీవోల సగటు సేకరణ పరిమాణం రూ. 2,700 కోట్లకు పెరి గింది.

2023లో ఈ పరిమాణం రూ. 867 కోట్లు. కేవలం డిసెంబర్ నెలలోనే 15 ఐపీవోలు మార్కెట్లోకి వచ్చాయి. రిటైలర్లకు ఆసక్తి పెరగడం, మార్కెట్లోకి దేశీయ పెట్టుబడులు పటిష్టంగా ఉండటం, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు చురుగ్గా పాలుపం చుకోవడం ఐపీవోల జోరుకు కారణమని ఆనంద్‌రాఠి అడ్వయిజర్స్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ హెడ్ ప్రశాంత్ రావు చెప్పారు.  

కొత్త ఏడాదిలో మరింత జోరు

వచ్చే కొత్త సంవత్సరంలో ఐపీవోల నిధుల సమీకరణ మరింత జోరందుకుంటుందని, 2024 రికార్డును మించుతుందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 75 ఐపీవో డాక్యుమెంట్లు వివిధ అనుమతులు, మార్కెటింగ్ దశలో ఉన్నాయని, 2025లో పబ్లిక్ ఆఫర్ల ద్వారా సమీకరించే నిధులు రూ.2.5 లక్షల కోట్ల మించవచ్చని ఈక్వరస్ మేనేజింగ్ డైరెక్టర్ మునీశ్ అగర్వాల్ చెప్పారు.

వచ్చే ఏడాది ఐపీవోలను జారీచేసే ప్రధాన కంపెనీల్లో హెచ్‌డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రతిపాదిత రూ.12,500 కోట్ల ఆఫర్, ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ రూ.15,000 కోట్ల ఇష్యూ, హెక్సావేర్ టెక్నాలజీస్ రూ. 9,950 కోట్ల ఆఫర్‌లు  ఉన్నాయి.