ఈ వారంలో ఐదు మెయిన్ పబ్లిక్ ఆఫర్లు
న్యూఢిల్లీ, డిసెంబర్ 8: ఈ వారం వివిధ కంపెనీలు ప్రైమరీ మార్కెట్‌ను ముంచెత్తనున్నాయి. విశాల్ మెగామార్ట్, సాయి లైఫ్ సైన్సెస్, ఒన్ మొబిక్విక్‌తో సహా ఐదు మెయి న్ బోర్డ్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్లతో స హా మొత్తం 11 కంపెనీలు ఈ వారం లో పబ్లిక్ ఆఫర్లు జారీచేసి రూ.18,500 కోట్లు సమీకరించేందుకు సిద్ధంగా ఉన్నాయి.
మెయిన్ బో ర్డులో విశాల్ మెగామార్ట్, సాయి లైఫ్ సైన్సెస్, ఒన్ మొబిక్విక్‌లతో పాటు ఇన్వెం టరస్ నాలెడ్జ్ సొల్యూషన్స్, అంతర్జాతీయ ఈక్విటీ ఫండ్ బ్లాక్‌స్టోన్‌కు చెందిన డైమండ్ గ్రేడింగ్ కంపెనీ జెమ్మోలాజికల్ ఇనిస్టిట్యూట్ ఇండియాల ఆఫర్లు మార్కెట్లోకి ప్రవే శిస్తున్నాయి.
ఈ ఐదు మెయిన్‌బోర్డ్ ఐపీవోలకు తోడు ఆరు ఎస్‌ఎంఈలు రూ. 150 కోట్లకుపైగా సమీకరించేందుకు తొలి పబ్లిక్ ఆఫర్లు జారీచేస్తున్నాయి. ఈ వారం ఐపీవోలు జారీచేసే కంపెనీల్లో వివిధ రంగాల కు చెందినవి ఉన్నాయి. ఆయా కంపెనీలు వాటి ప్రస్తుత షేర్‌హోల్డర్ల వాటాలను ఆఫ ర్ చేయడంతో పాటు విస్తరణ ప్రణాళికలకు, రుణాల చెల్లింపునకు, వర్కింగ్ మూలధనం అవసరా లకు నిధలు సమీకరించడానికి తాజా ఈక్విటీషేర్లను కూడా జారీచేస్తున్నాయి.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు, యూపీ లోక్‌సభ ఉప ఎన్నికల ఫలితాలు పాజిటివ్ మార్కెట్ సెంటిమెంట్‌ను నెలకొల్పాయని, ఈ నేపథ్యంలో ఐపీవో యాక్టివిటీ జోరందుకుందని ఆన్‌లైన్ బ్రోకరేజ్ సంస్థ ట్రేడ్‌జిని సీవోవో త్రివేశ్ తెలిపారు.
ఈ ఏడాది ఐపీవోలతో రూ.1.4 లక్షల కోట్ల సమీకరణ
ఈ 2024లో ఇప్పటివరకూ హ్యుందాయ్ మోటార్, స్విగ్గీ, ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్, ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీలతో సహా 78 మెయిన్‌బోర్డ్ కంపెనీలు పబ్లిక్ ఆఫర్లు జారీచేసి రూ.1.4 లక్షల కోట్లు సమీకరించాయి. 2023లో ఇదేకాలంలో ఐపీవోల ద్వారా 57 కంపెనీలు రూ.49,436 కోట్లు సమీకరించాయి.
11న విశాల్ మెగామార్ట్ ఆఫర్
రిటైల్ చైన్ విశాల్ మెగామార్ట్, సాయి లైఫ్ సైన్సెస్ ఐపీవోలు డిసెంబర్ 11న ప్రారంభమై 13న ముగు స్తాయి. ఇన్వెంచరస్ నాలెడ్జ్ సొల్యూషన్స్ ఆఫర్ డిసెంబర్ 12న, జెమ్మో లాజికల్ ఇనిస్టిట్యూట్ ఆఫర్ డిసెంబర్ 13న వస్తాయి. విశాల్ మెగా మార్ట్ ఐపీవో ద్వారా రూ.8,000 కోట్లు సేకరించాలన్నది లక్ష్యంకాగా, ఆఫర్ మొత్తం ప్రమోటర్లు ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) రూట్లో షేర్లను ఆఫర్ చేస్తున్నారు.
ఎటువంటి తా జా ఈక్విటీ షేర్లనూ కంపెనీ జారీచేయదు. ఈ ఆఫర్‌కు రూ.74 ప్రైస్‌బ్యాండ్‌ను నిర్ణయించారు. సా యి లైఫ్ సైన్సెస్ ఆఫర్ ప్రైస్‌బ్యాండ్ రూ.522 కాగా, రూ.3,043 కోట్లు సమీకరించాలన్నది లక్ష్యం. ఈ ఆఫర్లో రూ.950 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను కంపెనీ జారీచేస్తుంది.
మరో 3.81 కోట్ల షేర్లను ప్రమోటర్, ప్రస్తుత షేర్‌హోల్డర్లు ఓఎఫ్‌ఎస్ మార్గంలో విక్రయిస్తారు. రూ.572 కోట్ల సమీకరణకు వస్తున్న మొబిక్విక్ ఐపీవోకు రూ.265 279 ప్రైస్‌బ్యాండ్‌ను నిర్ణయించా రు.
ఆఫర్లో 2.05 కోట్ల తాజా ఈక్విటీ షేర్లను జారీచేస్తారు. ఇన్వెంచరస్ నాలెడ్జ్ రూ.2,500 కోట్లకు తెస్తున్న ఐపీవోలో మొత్తం షేర్‌హోల్డర్లు ఆఫర్ ఫర్ సేల్‌గా విక్రయి స్తున్నవే. రూ.4,225 కోట్ల సేకరణకు వస్తున్న ఇంటర్నేషనల్ జెమ్మో లాజికల్ ఇనిస్టిట్యూట్ ఐపీవోలో రూ.1,475 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను జారీచేస్తుండగా, బ్లాక్‌స్టోన్ అనుబంధ సంస్థ రూ. 2,750 కోట్ల విలువైన షేర్లను ఓఎఫ్‌ఎస్ రూట్లో విక్రయిస్తున్నది.