22-03-2025 12:26:32 AM
కోల్‌కతా, మార్చి 21: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2025) 18వ సీజన్‌కు శనివారం తెరలేవనుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్ వేదికగా డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్, రాయల్ చాలెం జర్స్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. మే 25 వరకు జరగనున్న ఐపీఎల్ రెండు నెలల పాటు క్రికెట్ అభిమానులను అలరించనుం ది.
కోల్‌కతా వేదికగా జరగనున్న తొలి మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కలిగించే అవకాశాలున్నాయి. తుఫాను ప్రభావంతో వాతావరణ నిపుణులు కోల్‌కతాకు ఆరెంజ్ అలర్ట్ జారీచేశారు. దీంతో శనివారం ఉద యం నుంచే కోల్‌కతాలో భారీ వర్షం పడే అవకాశం కనిపిస్తోంది. సాయంత్రానికి వర్షం అధికమయ్యే చాన్స్ కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
దీంతో మ్యాచ్ రద్ద య్యే చాన్స్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మ్యాచ్ ప్రారంభానికి ముందు జరగనున్న ఆరంభ వేడుకలకు అంతా సిద్ధమయ్యింది. బాలీవుడ్ స్టార్లు దిశా పటానీ, గాయని శ్రేయా ఘోషల్ లైవ్ ప్రదర్శన జరగనుంది. అయితే వరుణుడి దెబ్బకు ఆరంభ వేడుకలు కూడా జరుగుతాయా? లేదా? అన్న అనుమానం ఏర్పడింది.
ఇప్పటికే ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఏప్రిల్ 6న కోల్‌కతా, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్‌ను గౌహతికి మార్చారు. శ్రీరామ నవమి పండుగను పురస్కరించుకొని మ్యాచ్‌కు పూర్తి స్థాయి భద్రత ఇవ్వలేమని పోలీసులు పేర్కొనడంతో మ్యాచ్ వేదికను మార్చినట్లు బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) అధ్యక్షుడు స్నేహాశీష్ గంగూలీ వెల్లడించారు.
గతేడాది రన్నరప్‌గా నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ తొలి మ్యాచ్‌ను ఆదివారం ఉప్పల్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో ఆడనుంది.