బీసీసీఐ కార్యదర్శిగా దేవజిత్
ముంబై: మార్చి 23 నుంచి ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభం కానున్నట్లు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా వెల్లడించారు. మే 25న ఫైనల్ మ్యాచ్ జరిగే చాన్స్ ఉందని తెలిపారు. త్వరలోనే ఐపీఎల్ పూర్తి షెడ్యూల్ విడుదల కానున్నట్లు తెలిపారు. బీసీసీఐ నూతన కార్యదర్శిగా దేవజిత్ సైకా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గతేడాది జై షా ఐసీసీ చైర్మన్ బాధ్యతలు చేపట్టడంతో తాత్కాలికంగా ఉన్న దేవజిత్‌ను కార్యదర్శిగా ఎన్నుకుంటూ బీసీసీఐ జనరల్ బాడీ నిర్ణయం తీసుకుంది.
ఇక కోశాధికారిగా ప్రభ్‌తేజ్ సింగ్ కూడా ఏకగ్రీవమయ్యాడు. ఇక ఆదివారం జరిగిన బీసీసీఐ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇక ప్రతిష్ఠాత్మక ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి ఈ నెల 18 లేదా 19న సెలక్షన్ కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశంలోనే భారత జట్టును ఎంపిక చేయనుంది. ఫిబ్రవరి 19 నుంచి మొదలుకానున్న చాంపియన్స్ ట్రోఫీలో భారత్ తమ మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో ఆడనుంది.