వచ్చే సీజన్ కోసం క్రికెటర్ల మోగా వేలం జెడ్డా వేదికగా కొనసాగుతోంది. ఆటగాళ్ల కోసం ఫ్రాంఛైజీలు నేటి నుంచి కోట్లు వెదజల్లేందుకు పోటీపడుతున్నాయి. ఈ వేలంలో 577 మంది ఆటగాళ్లు పాల్గొనబోతున్నారు. ఐపీఎల్ చరిత్రలో భారత యువ ఆటగాడు రిషభ్ పంత్ రికార్డు ధర పలికాడు. వేలంలో పంత్ ను లఖ్ నవూ రూ.27 కోట్లకు దక్కించుకించుకోగా, అతని కోసం ఢిల్లీ, హైదరాబాద్ ఫ్రాంచైజీలు చివరి వరకు పోటీ పడాయి. రెండో వేలంలో శ్రేయస్ అయ్యర్ అత్యధిక ధర పలికారు.
శ్రేయస్ ను రూ. 26.75 కోట్లకు పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది. అర్ష్ దీప్ రూ.18 కోట్లకు పంజాబ్ కింగ్స్, బట్లర్ ను రూ.15.50 కోట్లకు గుజరాత్ టైటాన్స్, స్టార్క్ రూ.11.75 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్, రబాడను రూ.10.75 కోట్లకు గుజరాత్ టైటాన్స్ సోంతం చేసుకున్నాయి. కనీస ధర రూ.2 కోట్లు ఉన్న మహ్మద్ షమిని రూ.10 కోట్లకు సన్ రైజర్స్ హైదరాబాద్, సౌతాఫ్రికా హిట్టర్ డేవిడ్ మిల్లర్ ను రూ.7.5 కోట్లకు లఖ్ నవూ, టీం ఇండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ను రూ.18 కోట్లకు పంజాబ్ దక్కించుకున్నాయి. గతేడాది రికార్డు స్థాయిలో స్టార్క్ ధర రూ.24.75 కోట్లు, రబాడకు గుజరాత్ టైటాన్స్ రూ.10.75 కోట్ల వెచ్చించాయి.