calender_icon.png 17 April, 2025 | 3:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జోరుగా ఐపిఎల్ బెట్టింగ్

04-04-2025 11:31:09 PM

ఆన్లైన్ ఫోన్ యాప్ ల ద్వారానే బెట్టింగ్ కొనసాగుతున్న వైనం

మండలాల వారీగా ఏజెంట్లను నియమించు కొని కొనసాగుతున్న వైనం

నిజాంసాగర్,(విజయక్రాంతి) ఐపీఎల్ క్రికెట్ లీగ్ పుణ్యమా అని బెట్టింగ్ మాఫియా జోరుగా కోరలు చాస్తుంది. నియోజకవర్గం లోని ప్రతి మండల కేంద్రంతో పాటు గ్రామానికిఒక ఏజెంట్ ను  నియమించుకొని బెట్టింగ్ మాఫియా తన కార్యకలాపాలను కొనసాగిస్తుంది. ఎవరికి అనుమానం రాకుండా ఫోన్ల ద్వారా టీం ను బట్టి ఒకటికీ రెండంతలు డబ్బు వస్తుందని ఎర చూపి అమాయకులను బెట్టింగ్ ఊబిలోకి లాగుతున్నారు. ఎప్పటికప్పుడు ప్రత్యేక సందేశం, యాప్ ల ద్వారా మ్యాచ్ యొక్క వివరాలు అందిస్తూ బాల్ టు బాల్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. బాన్సువాడ ప్రధాన కేంద్రంగా ప్రధాన ఏజెంట్ ద్వారా  జుక్కల్ నియోజకవర్గం లోని అన్ని మండలకేంద్రాలు, గ్రామాలలో సబ్ ఏజెంట్ లను నియమించుకొని వారికి 1,000 కి ₹100 చొప్పున కమిషన్ ముట్ట చెబుతూ గుట్టు చప్పుడు కాకుండా వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. కిరాణా షాపులు, మెడికల్ షాపులు, టీ పాయింట్ ల యజమానులు అధిక మొత్తం లో బెట్టింగ్ నిర్వహిస్తున్నట్టు సమాచారం పోలీసులు సామాజిక మాధ్యమాల ద్వారా ఎప్పటికప్పుడు యువతను ప్రజలను అప్రమత్తం చేస్తున్న, బెట్టింగ్ నిర్వహిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించిన ఫలితం లేకుండా పోతుంది. బెట్టింగ్ ఉబిలో దిగి అమాయక యువకులు అప్పుల బారిన పడి ప్రాణాలు తీసుకునేంతవరకు వస్తుంది. బెట్టింగ్ మాఫియా ఇలాగే కొనసాగితే యువత డబ్బుల కోసం పెడదారిన పట్టే ప్రమాదం లేకపోలేదు. గతంలో బెట్టింగు బారిన  పడి సర్వస్వం కోల్పోయి ప్రాణాలు పోయిన సంఘటనలు అనేకంగా చోటు చేసుకొన్నాయి.  ఇకనైనా పోలీసులు అనుమానిత వ్యక్తుల ఫోన్ల ద్వారా జరుగుతున్న లావాదేవీలను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటే తప్ప బెట్టింగ్ మాఫియాకు అడ్డుకట్ట పడే అవకాశం లేదు.