calender_icon.png 31 March, 2025 | 10:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐపీఎల్ బెట్టింగ్లకు అడ్డాగా ఓ బార్ అండ్ రెస్టారెంట్ ?

28-03-2025 01:50:56 PM

పాల్వంచ,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem District) జిల్లా పారిశ్రామిక ప్రాంతమైన పాల్వంచలో ఐపీఎల్ లీగ్(Indian Premier League 2025) జరుగుతున్న వేళ యువతను ఆకర్షించే విధంగా పట్టణంలోని ఓ బార్ అండ్ రెస్టారెంట్ ఏకంగా  తెర ప్రొజెక్టర్ను ఏర్పాటు చేసి ఆటుమద్యానికి ఇటు బెట్టింగ్లకు యువతను  పెడదోవ పెట్టిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అటు మద్యం తాగుతూ ప్రొజెక్టర్లు ఐపీఎల్ మ్యాచ్ తిలకిస్తూ బాల్ బాలుకు బెట్టింగ్ లు కాస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం యువతను బెట్టింగ్ ల వైపు చెడు వ్యసనాల వైపు వెళ్లకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నా ,  పట్టణంలోని కొన్ని బార్ అండ్ రెస్టారెంట్ ఏకంగా ఏసీ రూమ్లలో ఎల్ఈడి టీవీలలో బయట సిట్టింగ్లో ప్రొజెక్టర్లు ఏర్పాటు చేసి యువతను వ్యసనానికి మరింతగా బానిసను చేస్తున్నట్లు తెలుస్తోంది. రెవెన్యూ, పోలీస్, ఎక్సైజ్ అధికారులు వారం రెస్టారెంట్లపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పట్టణ ప్రజలు కోరుతున్నారు.