calender_icon.png 20 September, 2024 | 4:06 PM

ఐఫోన్ 16 కోసం పరుగో.. పరుగు

20-09-2024 01:17:09 PM

హైదరాబాద్: నేటి యువత ఐ ఫోన్ ల కోసం ఎగబడుతున్నారు.. అదే అమెరికాలో మార్కెటింగ్ మా టెక్ ప్రియులు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న యాపిల్ ఐఫోన్ 16 సిరీస్ ఫోన్ల విక్రయం దేశ వ్యాప్తంగా శుక్రవారం తెల్లవారుజాము నుంచి ప్రారంభమైంది. ఈ ఫోన్ లను కొనుగోలు చేసేందుకు జనాలు తెల్లవారుజాము నుంచే యాపిల్ స్టోర్ ల ముందు బారులు తీరారు. ముంబై, ఢిల్లీ సహా పలు నగరాలలోని యాపిల్ స్టోర్ ల ముందు కొనుగోలుదారులు భారీగా కయూలు కట్టడం సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి. యాపిల్ ఇంటలిజెన్స్(ఏఐ) కొత్త చిప్ ఏ18తో వచ్చిన ఈ మొబైల్స్లో అధునాతన కెమెరా కంట్రోల్ బటన్, యాక్షన్ బటన్ అనే రెండు కొత్త బటన్లను యాపిల్ జతచేసింది. ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్  ప్రో మ్యాక్స్ అనే నాలుగు వేరియంట్లలో ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా ఐఫోన్ 16, ప్రారంభ ధర 79,900 ఉందని సంస్థ అధికారులు తెలియజేశారు.