calender_icon.png 19 April, 2025 | 4:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐఫోన్@3 లక్షలు!

11-04-2025 12:36:04 AM

  1. అమెరికాలో తయారయితే అంతే
  2. మూడు రెట్ల మేర ఖరీదవనున్న యాపిల్ ఫోన్

వాషింగ్టన్, ఏప్రిల్ 10: యూఎస్ కంపెనీలను స్వదేశానికి రప్పించి తద్వారా ఉద్యోగాల కల్పన పెంచాలని అమెరికా అనేక దేశాలపై సుంకాల భారం మోపింది. ఇలా చేయ డం వల్ల అమెరికాలో లక్షల సంఖ్యలో కొత్త ఉద్యోగాలు రావడంతో పాటు స్థానికంగా పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయని అధ్యక్షుడు ట్రంప్ భావిస్తున్నారు. దీని వల్ల స్మార్ట్ ఫోన్లు మరింత ప్రియం అయి కస్టమర్లకు పెను భారాన్ని మిగులుస్తాయని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

3,500 డాలర్లకు చేరనున్న ఐఫోన్ ధర!

యాపిల్ ఫోన్లను అమెరికాలో తయారు చేస్తే వాటి ధర 3500 డాలర్ల (దాదాపు రూ. 3 లక్షలు)కు చేరుకుంటుందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం ఐఫోన్ ధర 1,000 డాలర్లుగా ఉంది. అమెరికాలో ఉన్న అధునాతన ఫ్యాక్టరీల ఖర్చు, అద్దె, ఎక్కువగా ఉండే లేబర్ ఖర్చులతో ఐఫోన్ల ధరలు విపరీతంగా పెరుగుతాయి. ఇప్పటి వరకు ఎక్కు వ భాగం ఐఫోన్లు చైనాలో తయారవుతున్నా యి.

చైనాలో శ్రామికులకు వేతనం చాలా తక్కువ. అదే ఫోన్లను అమెరికాలో తయారుచేసేందుకు యాపిల్ సంస్థ ఎక్కువ మొత్తం ఖర్చు చేయాల్సి ఉంటుంది. మొదట అక్కడ కొత్తగా ప్లాంట్లు ఏర్పాటు చేయాలి, ఫోన్ తయారీకి కావాల్సిన వస్తువులు సమకూర్చుకోవాలి అంటే చాలా రోజుల సమయం పట్టే అవకాశం కూడా ఉంటుంది.

ఈ వసతులన్నీ ఆసియాలో సమకూర్చుకునేందుకు యాపిల్ కంపెనీకి దశాబ్దాల కాలం పట్టింది. ఒక నివేదిక ప్రకారం 10 శాతం యాపిల్ తయారీ యూనిట్‌లను అమెరికాకు తరలించేందుకే దాదాపు మూడేండ్ల సమయం పట్టే అవకాశం ఉంది. అందుకోసం 30 బిలియన్ డాలర్ల ఖర్చు కూడా అవనుంది. 

వివిధ దేశాల నుంచి.. 

యాపిల్ ఫోన్లలో వాడే రకరకాల ఉత్పత్తులు అనేక దేశాల నుంచి ఉత్పత్తి అవుతాయి. చిప్స్‌ను తైవాన్, స్క్రీన్స్‌ను సౌత్‌కొరియా, మిగతా భాగాలను ఎక్కువగా చైనా ఉత్పత్తి చేస్తుంది. ఐఫోన్లు ప్రపంచవ్యాప్తంగా ఎగుమతయ్యే ముందు ఈ అన్ని భాగాలు చైనా ఫ్యాక్టరీలలో అసెంబుల్ అవుతాయి. ఈ విధంగా చేయడం వల్లే యాపిల్ కంపెనీ తక్కువ ధరలకు ఫోన్లు తయారు చేస్తూ ఎక్కువ లాభాలను ఆర్జిస్తోంది.

ప్రపంచంలో అత్యధిక నిల్వలున్న కంపెనీల జాబి తాలో యాపిల్ ఉండేందుకు ఇది కూ డా ఒక కారణం అని అంతా విశ్వసిస్తారు. ట్రంప్ సుంకాలను ప్రకటించిన తర్వాత యాపిల్ షేరు ధర దాదాపు 25 శాతం పడిపోయింది. చైనా మీద అతిగా ఆధారపడటాన్ని తగ్గించేందుకు యాపిల్ ఇతర దేశాలలో తమ ఉత్పత్తులను ఉత్పత్తి చేసేందుకు యోచిస్తోంది.

తక్కువ సుంకాలు విధిస్తున్న జాబితా లో ఉన్న భారత్, బ్రెజిల్ వంటి దేశాల నుం చి యాపిల్ ఎక్కువ శాతం ఉత్పత్తి చేసేలా వ్యూహాలు రచిస్తోంది. ఒక వేళ యాపిల్ తన ఉత్పత్తిని అమెరికాకు తరలించకున్నా ధరలు పెరిగే అవకాశం ఉంది. టారిఫ్‌ల భారాన్ని యాపిల్ వినియోగదారులపై మోపితే కొత్త మోడల్స్ చార్జీలు 43 శాతం మేర పెరిగే అవకాశం ఉంది.