calender_icon.png 4 March, 2025 | 1:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈనెల 23 నుండి ఏప్రిల్ 14 వరకు దేశ రక్షణకై కార్యక్రమాలు

03-03-2025 07:41:43 PM

అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం జాతీయ అధ్యక్షులు డాక్టర్ దిడ్డి సుధాకర్

ముషీరాబాద్,(విజయక్రాంతి): ఈ నెల 23 నుండి ఏప్రిల్ 14 వరకు రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, దేశ రక్షణకై దేశ వ్యాప్తంగా వివిధ రూపల్లో కార్యక్రమాలు చేపట్టనున్నట్లు అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం జాతీయ అధ్యక్షులు డాక్టర్ దిడ్డి సుధాకర్(All India Peace and Solidarity Association National President Dr. Diddi Sudhakar ) వెల్లడించారు. గుజరాత్ లోని సూరత్ పట్టణంలో ఐపీసీ జాతీయ ఆఫీస్ బేరర్ల(IPC National Office Bearers) సమావేశం డాక్టర్ దిడ్డి సుధాకర్ అధ్యక్షతన మూడు రోజుల పాటు జరిగాయి.

సోమవారం ముగింపు సమావేశంలో డాక్టర్ దిడ్డి సుధాకర్ మాట్లాడుతూ... శాంతిధుత ఫిడేల్ కాస్త్రో శత జయంతి ఉత్సవాలు, హీరోషిమ నాగశకి అమరులకు నివాళులు దేశ వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, అలాగే ప్రపంచ వ్యాప్తంగా యుద్దాలు నివారణకు ప్రదర్శనాలు నిర్వహిస్తామని తెలిపారు.13వ ఇండో వియత్నం ఉత్సవాలు ఆంధ్రప్రదేశ్ రాష్టం లో నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ సమావేశంలో ప్రపంచ శాంతి సంఘం అధ్యక్షులు పల్లబ్ సేన్ గుప్తా, ఐపిసో జాతీయ ప్రధాన కార్యదర్శి హరిచంద్ సింగ్ బాట్ తోపాటు కేరళ, పచ్చిమ బెంగాల్, పొందిచెర్రీ, తమిళ నాడు, మధ్యప్రదేశ్, ఢిల్లీ, తెలంగాణ, గుజరాత్, రాజస్థాన్ లనుండి ఆఫీస్ బేరేర్లు పాల్గొన్నారు.