calender_icon.png 26 October, 2024 | 10:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

మనీ లాండరింగ్‌లో ప్రమేయం ఉందంటూ..

30-08-2024 12:40:06 AM

వృద్ధుడికి గాలం.. ఖాతా నుంచి రూ.8.75 లక్షలు హుష్

బాధితుడి ఫిర్యాదు మేరకు సైబర్ కేసు నమోదు 

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 29 (విజయక్రాంతి): మనీలాండరింగ్ కేసులో వృద్ధుడికి ప్రమేయం ఉందంటూ సైబర్ నేరగాళ్లు ఢిల్లీ పోలీసులుగా నమ్మించి బెదిరిం పులకు పాల్పడ్డారు. బాధితుడి ఖాతా నుంచి రూ.8.75 లక్షలు కాజేశారు. తెలిసిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన 85 ఏళ్ల విశ్రాంత ఉద్యోగికి ఇటీవల టెలికమ్యూని కేషన్స్ డిపార్ట్‌మెంట్ నుంచి మాట్లాడుతు న్నట్లు ఓ మహిళ కాల్ చేసింది. కాల్ ఢిల్లీ పోలీసులకు కలుపుతున్నట్లు కనెక్ట్ చేసింది. అవతలి వ్యక్తి తాను ఢిల్లీలో తాను ఓ పోలీస్ అధికారిని అని వృద్ధుడిని పరీచయం చేసు కున్నాడు.

మనీ లాండరింగ్ కేసులో వృద్ధు డిపై ఢిల్లీ సెషన్స్ కోర్టులో 15 కేసులు నమోదై నట్లు బెదిరించాడు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని, లేదంటే వెం టనే అరెస్ట్ చేస్తామ న్నాడు. విచారణ అవస రాల నిమిత్తం 24 గంట ల్లో రూ.8.75 లక్షలు కావాలని, ఆ సొమ్ము తిరిగి ఇచ్చే స్తానని కాలర్ నమ్మబ లికాడు. వృద్ధుడు వెం టనే కాలర్ ఇచ్చిన బ్యాంక్ ఖాతాలో రూ.8.75 లక్షలు జమ చేశాడు. తర్వాత ఎన్నిరోజులైన వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో మోసపో యానని గ్రహించిన బాధితుడు గురువారం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.