calender_icon.png 1 March, 2025 | 11:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వసంత పంచమి వేడుకలకు ఆహ్వానం

28-01-2025 06:25:38 PM

భైంసా (విజయక్రాంతి): కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ను హైదరాబాదులో ఆయన నివాసంలో ముదోల్, ఆదిలాబాద్ శాసనసభ్యులు పవార్ రామారావు పాటిల్, పాయల్ శంకర్ కలిశారు. బండి సంజయ్ పార్టీ స్థితిగతులపై చర్చించి రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి అయిన అంజిరెడ్డి గెలుపు కొరకు కృషి చేయాలని కోరడం జరిగింది. ఈ సందర్భంగా ముధోల్ శాసనసభ్యులు పవర్ రామారావు పటేల్ బండి సంజయ్ త్వరలో బాసరలో సరస్వతి అమ్మవారి ఆలయంలో జరగనున్న వసంత పంచమి ఉత్సవాలకు రావాలని కోరడం జరిగింది. దీనికి వారు సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఆలయానికి ప్రసాదం స్కీం లో కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు మంజూరు చేయిస్తారని కూడా హామీ ఇచ్చారన్నారు.