కరీంనగర్: ఢిల్లీ లోని ఎర్రకోటలో ఆగస్టు 15 న జరిగే 77 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల చారిత్రాత్మక కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా యువశక్తి యూత్ సభ్యులు తొర్తి శ్రీనివాస్ కు ఆహ్వానం అందింది. సామాజిక సేవా రంగంలో చేస్తున్న కృషికి గానూ నెహ్రూ యువ కేంద్ర,కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడాశాఖ, భారత ప్రభుత్వం శ్రీనివాస్ ను ఎంపిక చేసింది. దేశం నలుమూలల నుంచి 68 మంది యువకులను భారత్ వాలంటీర్ లుగా ఎంపిక చేసింది.
ఇందులో తెలంగాణ రాష్ట్రం నుండి రాష్ట్ర యువ ప్రతినిధిగా శ్రీనివాస్ కు ప్రాతినిథ్యం లభించింది. గతంలోను ఢిల్లీలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మేరీ మాటి, మేరీ దేశ్ కార్యక్రమానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి శ్రీనివాస్ కు అవకాశం లభించింది. ఉమ్మడి జిల్లా ఉత్తమ యువజన సంఘం అవార్డి, విద్యార్థి, సామాజిక ఉద్యమాల్లో, జాతీయత భావాలను పెంపొందించేందుకు, దేశసేవనే పరమావధిగా ముందుకు సాగు తానని శ్రీనివాస్ తెలిపారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు అవకాశం కల్పించిన అధికారులకు,కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కి ఆయన ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు