calender_icon.png 6 February, 2025 | 6:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంత్రికి ఆహ్వానం

30-01-2025 12:00:00 AM

శ్రీధర్ బాబును కలిసిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ 

రాజేంద్రనగర్, జనవరి 29: తన నియోజకవర్గంలో కులాలు అభివృద్ధి పను లకు శంకుస్థాపన చేయాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ బుధవారం రాష్ట్ర ఐటీ, రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబును కలిసి విజ్ఞప్తి చేశారు.

మినిస్టర్స్ క్వార్టర్స్ లో ఆయనను కలిసిన ఎమ్మెల్యే తన నియోజకవర్గంలోని బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్, మణికొండ, నార్సింగిలో మున్సిపల్ నిధులతో పూర్తిచేసిన, చేయబోతున్న పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవా లు చేయుటకు ఈనెల 6న ముఖ్య అతిథిగా హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు. దీనికి మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే వివరించారు.