calender_icon.png 16 October, 2024 | 3:56 PM

రాష్ట్రస్థాయి ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్ పోటీలకు ఆహ్వానం: జిల్లా ఎస్పీ

16-10-2024 01:44:18 PM

మెదక్ జిల్లాపోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం (ఫ్లాగ్ డే)ను పురస్కరించుకొని మెదక్ జిల్లా పరిధిలో ఔత్సహిక ఫోటోగ్రాఫర్లకు ఫోటోగ్రఫీ అదే విధంగా షార్ట్ ఫిల్మ్ కు సంబంధించి తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో పోటీలను నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్.పి డి.ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. పోలీస్ ఫ్లాగ్ డే అమరవీరుల ప్రాణత్యాగాలను స్మరిస్తూ ఈనెల 21న వారోత్సవాలు నిర్వహించబడతాయని, ఈ పోటీలకు విద్యార్థులతో పాటు, యువత ఔత్సాహిక ఫోటోగ్రాఫర్లు పాల్గోనాలని అన్నారు. ఇందులో భాగంగా పోలీసుల త్యాగాలు, పోలీసు విధుల్లో ప్రతిభను తెలిపే విధంగా ఉండే ఇటీవల కాలంలో తీసిన (3) ఫోటోలు మరియు తక్కువ నిడివి (3 నిమిషాలు) గల షార్ట్ ఫిలిమ్స్ తీసి రాష్ట్రస్థాయి పోటీల కోసం ఈనెల 20 వ తేదీలోపు జిల్లా పోలీస్ కార్యాలయంలో సంబంధిత షార్ట్ ఫిల్మ్ లోడ్ చేసిన పెన్ డ్రైవ్, 10 x 8 సైజ్ ఫోటోలను పోలీస్ పిఆర్వోకు అందజేయాలన్నారు.


ఈ పోటీలకు నామినేషన్లు పంపించే ఔత్సహికులు మూడనమ్మకాలు, ఇతర సామాజిక రుగ్మతలపై, అత్యవసర సమయాల్లో పోలీసుల స్పందన.. ప్రకృతి వైపరిత్యాల్లో పోలీసుల సేవ.. ఇతర సందర్భాల్లో పోలీసుల కీర్తి ప్రతిష్టలు.. సైబర్ నేరాలు ఈవ్ టీజింగ్, ర్యాగింగ్, మత్తు పదార్థాల సేవనం వాటి అనర్దాలు అనే  అంశాలకు సంబంధించి గత సంవత్సరం 2023 అక్టోబర్ నుండి ప్రస్తుత సంవత్సరం అక్టోబర్ నెల ఇప్పటివరకు తీసిన మూడు ఫోటోలు, షార్ట్ ఫిల్మ్ మాత్రమే పంపించాల్సి వుంటుందని తెలిపారు. వివరాల కోసం 8712529559, 9640474336  నెంబర్ ద్వారా పీఆర్ఓను సంప్రదించాలన్నారు.