calender_icon.png 21 February, 2025 | 8:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యే పాయంకు ఆహ్వానం

20-02-2025 04:26:16 PM

బూర్గంపాడు (విజయక్రాంతి): పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును మణుగూరులోని ఆయన నివాసంంలో గురువారం లక్ష్మీపురం గ్రామ వాసులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈనెల 26న లక్ష్మీపురం గ్రామంలో జరిగే శ్రీశ్రీశ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మం కళ్యాణ మహోత్సవ వేడుకలకు ముఖ్య అతిథులుగా రావాలని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీపురం మాజీ ఉప సర్పంచ్ పోతిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి, రమేష్ రెడ్డి, ఆలయ అర్చకులు, ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, యూత్ సభ్యులు ఉన్నారు.