ఆహ్వానం అందజేసిన బీసీ సంఘం నేతలు..
ముషీరాబాద్ (విజయక్రాంతి): ఢిల్లీలోని ఏపీ భవన్‌లో గురువారం ఉదయం 11 గంటలకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య అధ్యక్షతన జరిగే బీసీ రౌండ్‌టేబుల్ సమావేశానికి ముఖ్యఅతిధిగా హాజరుకావాలని కేంద్ర సోషల్ జస్టిస్ మంత్రి రాంబాబు ఆదావలేను ఆహ్వానించినట్లు ఆంధ్రప్రదేశ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బొను దుర్గా నరేష్ యాదవ్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జకృష్ణ, సంఘం అధికార ప్రతినిధి, ఢిల్లీ ఇన్‌ఛార్జి కర్రి వేణుమాదవ్‌లు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం యువజన అధ్యక్షుడు రాయుడు రాకేష్ (కాకా), బీసీ నాయకులు అశోక్, బీసీ నాయకురాలు విజయలక్ష్మీ, పవన్ తదితరులు పాల్గొన్నారు.