calender_icon.png 26 December, 2024 | 4:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఆహ్వానం

08-11-2024 08:58:27 PM

కరీంనగర్,(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా కోర్టు ఆవరణలో ఈనెల 10వ తేదిన నిర్వహించబోయే నూతన భవన నిర్మాణ భూమి పూజ జరుగనుంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాదేకు కరీంనగర్ జిల్లా జడ్జి బి.ప్రతిమ ఆహ్వానపత్రం అందచేశారు. జడ్జి బి.ప్రతిమ వెంట బార్ అసోసియేషన్ అధ్యక్షులు పీవీ రాజ్ కుమార్,  ప్రధాన కార్యదర్శి బేతి మహేందర్ రెడ్డి, కార్యదర్శి బీమా సాహెబ్,  కార్యవర్గ సభ్యులు సుంకే దేవ కిషన్లు శుక్రవారం హైకోర్టు జడ్జి తో పాటు జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి కే. లక్ష్మణ్, హైకోర్టు న్యాయమూర్తులు టి. వినోద్ కుమార్, బి. విజయ్ సేన్ రెడ్డి, ఎన్వీ శ్రావణ్ కుమార్, ఈవీ వేణుగోపాల్, పుల్ల కార్తీక్, జె. శ్రీనివాస రావులకు ఆహ్వాన పత్రిక అందించారు. నూతన జిల్లా కోర్టు భవన నిర్మాణ భూమి పూజతో, పాటు బ్యాంకు కాలనీ డి.మార్ట్ రోడ్డులో న్యాయమూర్తుల నూతన నివాస సముదాయానికి భూమి పూజ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.ప్రతిమ  తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఉమ్మడి జిల్లా బార్ అసోసియేషన్ న్యాయవాదులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు