15-03-2025 10:56:18 PM
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల(Mahatma Jyotiba Phule Gurukul School)లో ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కన్వీనర్ శ్వేత(District Convener Shweta) ప్రకటనలో కోరారు. జిల్లాలోని బాలుర, బాలికల గురుకుల పాఠశాలలో ఆరవ తరగతి నుండి తొమ్మిదవ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్లకు అర్హులైన విద్యార్థిని, విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈనెల 31 లోగా దరఖాస్తులు సమర్పించాలని, 15వ తేదీ నుండి హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఏప్రిల్ 20 న ప్రవేశ పరీక్ష నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అర్హులైన వారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మరింత సమాచారానికి https://mjptbcwreis.telangana.gov.in వెబ్సైట్ సందర్శించాలని తెలిపారు.