21-02-2025 03:41:19 PM
హైదరాబాద్: శివరాత్రి సందర్భంగా కీసర గుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం(Keesaragutta Sri Ramalingeswara Swamy Temple)లో జరిగే బ్రహ్మోత్సవాలకు రావాలని కోరుతూ టీపీసీసీ ఉపాధ్యక్షుడు, మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తోటకూర వజ్రెష్ యాదవ్ అధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి(CM Anumula Revanth Reddy)ని శుక్రవారం నాడు ఆయన నివాసంలో కలిసి ఆహ్వానించారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో కీసర గుట్ట చైర్మన్ తాటకం నారాయణ శర్మ, టెంపుల్ డైరెక్టర్లు ఉన్నారు.