calender_icon.png 26 December, 2024 | 1:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కురుమూర్తి బ్రహ్మోత్సవాలకు సీఎంకు ఆహ్వానం

02-11-2024 02:36:32 AM

మహబూబ్‌నగర్, నవంబర్ 1 (విజయక్రాంతి)/హైదరాబాద్: దేవరకద్ర నియోజకవర్గంలోని కురుమూర్తి ఆలయ పరిధిలో జరుగనున్న బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆలయ పాలకమండలి సభ్యులు, అర్చకులు శుక్రవారం హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి ఆహ్వానించారు. ఈ  మేరకు ఆహ్వాన పత్రం అందజేశారు. 

కురుమూర్తి జాతరకు ప్రత్యేక బస్సులు

మహబూబ్‌నగర్‌లో జిల్లాలో ఈ నెల 7 నుంచి 9వ తేదీ వరకు జరుగనున్న కురుమూర్తి స్వామి జాతర, ఉద్దాల ఉత్సవానికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ యాజమాన్యం హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులు కేటాయించింది. భక్తులు tgsrtcbus.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు.