calender_icon.png 23 January, 2025 | 10:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏకలవ్య పాఠశాలకు దరఖాస్తుల ఆహ్వానం

23-01-2025 04:26:41 PM

గండు గొల్లపల్లి పాఠశాల ప్రిన్సిపల్...

దమ్మపేట (విజయక్రాంతి): ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ లో ఆరవ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గండుగులపల్లి లో గల  ఏకలవ్య మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ సంజయ్ మలాకర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గిరిజనులైన, విద్యార్థులు, తల్లిదండ్రులు లేని, విద్యార్థులు, దివ్యాంగులైన విద్యార్థులు, 5వ తరగతి చదివి మార్చి 2025 నాటికి పది నుంచి 13 ఏళ్ల లోపు వయసు కలిగి ఉండాలి, ఆన్లైన్లో, దరఖాస్తు చేసుకొనుటకు ఆఖరి తేదీ ఫిబ్రవరి 16, పరీక్ష రుసుము 100 రూపాయలు ఉంటుందని, ప్రవేశ పరీక్ష మార్చి 16వ తేదీన జరగనుందని, ఆరవ తరగతిలో ఖాళీలు 30 బాలికలకు, 30 బాలురకు, ఉన్నాయని పాఠశాల ప్రిన్సిపల్ తెలియజేస్తున్నారు.