హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 6 (విజయక్రాంతి): అల్పసంఖ్యాక వర్గాల విద్యార్థు లు విదేశాల్లో ఉన్నత చదువుల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించే సీఎం ఓవ ర్సీస్ స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి ఇలియాస్ తెలిపారు. అమెరికా, ఆస్ట్రేలియా, లండన్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, న్యూజిలాండ్, సౌత్‌కొరియా, సింగపూర్ దేశాల్లో చదువుకోవడానికి అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 8 నుంచి ఆగస్టు 7 వరకు www.telangana epass.cgg.gov.in, http://www.tela nganaepass.cgg.gov.in, http:// www.telanganaepass.cgg.gov.in అనే వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు.
దరఖాస్తు చేసుకున్న ఆన్‌లైన్ ఫామ్స్‌ను జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి కార్యాలయంలో అందజేయాలని చెప్పారు. విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.5 లక్షల లోపు ఉండాలని తెలిపారు. ఈ పథకం ద్వారా ఎంపికైన విద్యార్థులకు ప్రభుత్వం నుంచి రూ.20 లక్ష లు, విమాన ఛార్జీల కోసం రూ.60 వేలు అందజేస్తారని చెప్పారు. ఇతర వివరాలకు 040 నంబర్‌లో కానీ నాం పల్లి హజ్‌హౌజ్‌లోని మైనార్టీ సంక్షేమ శాఖ జిల్లా కార్యాలయంలో కానీ సంప్రదించాలని పేర్కొన్నారు.