calender_icon.png 24 December, 2024 | 2:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గురుకుల పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం..

23-12-2024 09:49:09 PM

రామాయంపేట: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి గాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థిని విద్యార్థుల కోసం ఇంగ్లీషు మీడియం 5వ తరగతిలో ప్రవేశం పొందుటకు 4వ తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం దరఖాస్తులకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు రామాయంపేట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ సంధ్యారాణి తెలిపారు. ఈ ప్రవేశాలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ జనరల్ విద్యార్థులు ఈ నెల 21వ తేదీ నుండి ఫిబ్రవరి 1వ తేది వరకు 100 రూపాయల రుసుము చెల్లించి అర్హత గల విద్యార్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చని, ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు.