హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 27 (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) పరిధిలోని జిల్లా కోర్టు లు, ట్రయల్ కోర్టులలో స్టాండింగ్ కౌన్సిల్ నియామకానికి ఆసక్తి కలిగిన న్యాయవాదుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్టు జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఇలంబర్తి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా బార్ అసోసియేషన్‌లో 10 ఏళ్లు, సీనియర్ సివిల్ కోర్డులో 7 సంవత్సరాలు, జూనియర్ సివిల్ కోర్టులో 5 సంవత్సరాలు అనుభవం కలిగిన వారు అర్హులన్నారు.
రంగారెడ్డి జిల్లాలోని ట్రయల్ కోర్టులో 8 పోస్టులు, సికింద్రాబాద్ 7 పోస్టు పటాన్‌చెరు, రామచంద్రపురం కోర్టులలో ఒక్కొక్క పోస్టు ఖాళీగా ఉన్నట్టు పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన న్యాయవాదులు 2025 జనవరి 23వ తేదీ సాయంత్రం 5 గం ట్యాంక్‌బండ్ సమీపంలోని జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో దరఖాస్తులను అందజేయాలన్నారు.