calender_icon.png 12 April, 2025 | 3:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీతారాముల కల్యాణ మహోత్సవానికి రండి

04-04-2025 11:40:02 PM

పటాన్ చెరు: శ్రీ రామ నవమి పర్వదినం పురస్కరించుకొని పటాన్ చెరు పట్టణంలోని శ్రీ కోదండ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో ఆదివారం నిర్వహించనున్న బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను శుక్రవారం సాయంత్రం పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్  రెడ్డి దంపతులకు  పటాన్ చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ దంపతులు, ఆలయ పూజారులు, కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈనెల 4వ తేదీ నుండి 8వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, తదితరులు పాల్గొన్నారు.