03-02-2025 12:20:52 AM
మహబూబ్ నగర్, ఫిబ్రవరి 2 (విజయక్రాంతి) : జిల్లా వ్యాప్తంగా 16 మండల పరిషత్ పరిధిలోని జడ్పిటిసి, ఎంపిటిసిల ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్ పాత్రల ముద్రనకు అర్హులైన ప్రింటింగ్ ప్రెస్ వారి నుంచి సీల్డ్ కవర్ టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి ఒక ప్రకటన లో తెలిపారు. గతంలో ముద్రణ చేసిన వారికి ప్రాథమిక ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు.
ఈ నెల నాలుగో తేదీ నుంచి 8వ తేదీ వరకు జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో సిల్క్ అవర్ టెండర్లను దాఖలు చేయాలని పేర్కొన్నారు. ఈనెల 11వ తేదీన టెండర్ వేసిన ప్రింటింగ్ ప్రెస్ నిర్వాహకుల సమక్షంలో టెండర్లను ఓపెన్ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.