14-03-2025 06:05:56 PM
పర్యావరణ - ప్రకృతి కి సంబంధిచిన అంశంపై కథనం ఉండాలి
కథనం ఏ తెలుగు పత్రికలో అచ్చయినా పర్వాలేదు
ఆన్లైన్ పత్రికల పాత్రికేయులు కూడా పాల్గొనొచ్చు
ముషీరాబాద్,(విజయక్రాంతి): పర్యావరణ భావజాలం వార్తలు, కథనాలు రాసిన పాత్రికేయులను ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ డెవలప్మెంట్ కౌన్సిల్ (EPDC) “పాత్రికేయమిత్ర ” ఆవార్డులతో సత్కరించనున్నట్లు ఈపీడీసీ కౌన్సిల్ పేర్కొంది. పర్యావరణ పరిరక్షణ భారతీయ సంస్కృతిలో భాగం. దానికి నిలువెత్తు మనం గొప్పగా జరుపుకొనే ఉగాది. అలాంటి ఉగాది పండుగను పురస్కరించుకొని ఈ పోటీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ఎస్సీ హెచ్ రంగయ్య, శుక్రవారం విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. పోటీలో పాల్గొనే పాత్రికేయులు పర్యావరణానికి సంబంధించి రాసిన కథనానికే పోటీ అర్హత ఉంటుంది. ఈ సంవత్సర కాలంలో రాసిన కథనాన్ని ఈనెల 25 లోపు పంపాలి చిన్నా, పెద్దా పత్రిక బేధం లేదు. బై లైన్ కానీ, సంబంధిత సంస్థ ఐడీ కార్డు ఆధారంగా ఎంట్రీ పరిశీలన ఉంటుంది. విజేతలకు పర్యావరణ “పాత్రికేయ మిత్ర“ అవార్డుతో పాటు సత్కారం ఉంటుంది. పత్రికలకు పర్యావరణ భావజాలం లోపిస్తోంది అన్న విమర్శలకు ధీటుగా తమ పాత్రికేయులతో అద్భుత కథనాలు రాయించి ఆ విమర్శ అపోహ మాత్రమే అని నిరూపించేలా పత్రికల యాజమాన్యాలు చొరవ తీసుకోవాలని కౌన్సిల్ అధ్యక్షులు రంగయ్య విజ్ఞప్తి చేశారు.