17-03-2025 12:11:33 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, మా ర్చి 16(విజయక్రాంతి) : హైదరాబా ద్ జిల్లాలోని మహాత్మాజ్యోతిబాపూలే బాలురు, బాలికల గురుకుల విద్యాలయాల్లో 6, 7, 8, 9 తరగతుల్లో మమిగిలిపోయిన సీట్లలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆర్‌సీవో డాక్టర్ ఆది త్యవర్మ తెలిపారు. మార్చి 31వరకు ఆన్‌లైన్‌లో, మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని ఒక ప్రకటన లో పేర్కొన్నారు. www.mjptbcw reis.telangana.gov.in వెబ్‌సైట్‌లో కూడా దరఖాస్తు చేసుకో వచ్చని చెప్పారు. ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 20న ఉంటుందన్నారరు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.