calender_icon.png 17 March, 2025 | 9:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ గురుకులాల్లో ప్రవేశాలకు ఆహ్వానం

16-03-2025 11:49:03 PM

హైదరాబాద్ సిటీబ్యూరో (విజయక్రాంతి): హైదరాబాద్ జిల్లాలోని మహాత్మా జ్యోతిబా పూలే బాలురు, బాలికల గురుకుల విద్యాలయాల్లో 6, 7, 8, 9 తరగతుల్లో మిగిలిపోయిన సీట్లలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆర్‌సీవో డాక్టర్ ఆదిత్యవర్మ తెలిపారు. మార్చి 31 వరకు ఆన్‌లైన్‌లో, మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. www.mjptbcwreis.telangana.gov.in వెబ్‌సైట్‌లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 20న ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.