29-03-2025 08:37:50 PM
కామారెడ్డి (విజయక్రాంతి): వరుస ఘటనలతో కామారెడ్డి జిల్లా భిక్నూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అబాసు పాలవుతుంది. ఇంతకు ముందే పరీక్ష కేంద్రంలోకి ప్రైవేట్ యాజమాన్యంని సెల్ ఫోన్ తో అనుమతించిన రచ్చ మరువకముందే పరీక్ష సమయం అయిపోక ముందే పిల్లల దగ్గర నుండి పరీక్ష పేపర్స్ లాక్కోవడంతో దుమారం లేచింది. పరీక్షా కేంద్రంలోని రూమ్ నెంబర్ నాలుగు లో బయోసైన్స్ పరీక్ష పూర్తికాకముందే విద్యార్థుల నుంచి పరీక్ష పేపర్లు లాక్కున్న ఇన్విజిలేటర్ ని తొలగించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి.
విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడ వద్దని హెచ్చరించారు. ఇట్టి విషయంలో అమానుషంగా ప్రవర్తించిన ఇన్విజిలేటర్లను విధుల నుంచి తొలగించాలని టీజీవిపి జిల్లా అధ్యక్షుడు గంధం సంజయ్ డిమాండ్ చేశారు. ఇట్టి విషయమై కొందరు జిల్లా ఉన్నతాధికారికి ఈ విషయంలో ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిసింది. మండల విద్యాధికారులు ప్రైవేట్ స్కూలు యాజమాన్యానికి అనుకూలంగా ప్రవర్తిస్తున్నారని గ్రామంలో చర్చ నడుస్తుంది.