08-02-2025 12:37:35 AM
మూడో సెషన్లోనూ నష్టాలతో ముగిసిన సూచీలు
ముంబై: వడ్డీరేట్లు తగ్గిస్తూ ఆర్‌బీఐ ద్రవ్య పరపతి సమీక్షలో నిర్ణయం తీసుకున్నా ఇన్వెస్టర్లకు నచ్చలేదు. అంచనాలకు అనుగుణం గా రెపోరేట్ 25 బేసిక్ పాయింట్లు తగ్గిస్తూ.. ద్రవ్య పరపతి సమీక్షలో ఆర్బీఐ నిర్ణయం తీసుకున్నా స్టాక్స్‌పై అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ఫలితంగా వరుసగా సెన్సెక్స్ మూడో రోజు పతనమైంది.
శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. బీఎస్‌ఈ -30 ఇండెక్స్ సెన్సెక్స్ 198 పాయింట్ల నష్టం తో 77,860 పాయింట్ల వద్ద స్థిర పడింది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 78,357 పాయింట్ల గరిష్టానికి దూసుకెళ్లింది. తిరిగి 77,476 పాయింట్ల కనిష్టానికి పడిపోయిం ది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో దాదాపు 900 పాయింట్లు సెన్సెక్స్ పతనమైంది.
మరోవై పు ఎన్‌ఎస్‌ఈ-50 సూచీ నిఫ్టీ ఇంట్రాడే ట్రే డింగ్‌లో 23,694 23,443 పాయింట్ల మ ధ్య తచ్చాడింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి 43.40 పాయింట్ల నష్టంతో 23,560 పాయింట్ల వద్ద ముగిసింది. బీఎస్‌ఈ- 30 సెన్సెక్స్‌లో ఐటీసీ 4.5 శాతం లాభ పడింది. భారతీ ఎయిర్‌టెల్ మూడో త్రైమాసికంలో ఐదు రెట్లు నికర లాభం వృద్ధి చెందడంతో 3.5 శాతం లబ్దితో ముగిసింది.
ఇంకా జొ మాటో, మహీంద్రా అండ్ మహీంద్రా, ఆల్ట్రాటెక్ సిమెంట్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్రా, ఎన్ టీపీసీ తదితర స్టాక్స్ లాభాలతో ముగిశాయి. మరోవైపు ఎస్‌బీఐ రెండు శాతానికి పైగా నష్టపోగా, అదానీ పో ర్ట్స్, టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, పవర్ గ్రిడ్ భారీగా నష్టపోయాయి.
ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఎఫ్‌ఎంసీజీ, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్‌లు సుమా రు.1.5 శాతం చొప్పున నష్టపోయాయి. ఆయిల్ అండ్ గ్యాస్ ఒకశాతం నష్టపోతే, నిఫ్టీ మెటల్ ఇండెక్స్ రెండు శాతానికి పైగా లాభ పడింది. ఆసియా మార్కెట్లలో సియోల్, టో క్యో మార్కెట్లు నష్టాలతో ముగిస్తే, షాంఘై, హాంకాంగ్ లాభాలతో స్థిర పడ్డాయి.