calender_icon.png 21 January, 2025 | 7:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైసీపీ విధ్వంసంతో పెట్టుబడిదారులు పారిపోయారు

12-07-2024 02:14:35 AM

ఏపీ సీఎం చంద్రబాబు

హైదరాబాద్, జూలై 11 (విజయక్రాంతి) : ఏపీ పునర్నిర్మా ణం కోసం ఓ లక్ష్యంతో పని చేస్తున్నామని సీఎం చంద్రబాబు నాయడు ఎక్స్ వేదికగా తెలిపారు. వైసీపీ నిర్వాకంతో పెట్టుబడిదారులు పారిపో యారని, ఏపీలో పెట్టుబడి పెట్టాలంటే ఆలోచిస్తున్నారని పేర్కొన్నా రు. ఇప్పుడు వారిని ఆకర్షించాలంటే పెద్ద సవాల్‌గా మారిందన్నా రు. ఐదేళ్ళ విధ్వంసంతో వారు విశ్వాసం కోల్పోయారని, దాని ప్రభావం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై పడిందన్నారు. మన రాష్ట్రం సురక్షితమని వారిలో భరోసా కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో అందరి మద్దతు కావాలని, దేశంలో రాష్ట్రాన్ని నెంబర్ ౧గా ఉంచేలా కృషి చేస్తామన్నారు.