20-03-2025 01:46:46 AM
మహారాష్ట్రలో రూ.4,500కోట్లతో గ్రీన్‌ఫీల్డ్ హైవే
కేంద్ర క్యాబినెట్‌లో నిర్ణయాలు
న్యూఢిల్లీ, మార్చి 19: దేశంలో డిజిటల్ చెల్లింపులను మరింత ప్రోత్సహిం పాడి పరిశ్రమ, ఫెర్టిలైజర్ రంగాలను అభివృద్ధి చేయడం కోసం ఆయా రంగాల్లో రూ.16వేల కోట్ల మేర పెట్టుబడులు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసు ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన కేంద్ర క్యాబినెట్ బుధవారం సమావేశం అయింది. ఈ సమావేశంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియా సమావేశంలో వెల్లడించారు.
రాష్ట్రీయ గోకుల్ మిషన్ కింద పాల ఉత్పత్తి, దేశీయ పశు జాతుల ఉత్పాదకతను పెంచడం కోసం రూ.3,400 కోట్లు కేటాయిస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుందని చెప్పారు. దీంతో పాటు పాడి రైతులకు మద్దతుగా మెరుగైన మార్కెట్ సౌకర్యాలు కల్పించడం, మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి కార్యక్రమం (ఎన్‌పీడీడీ)కు రూ.2,790 కోట్లు కేటాయిం చినట్టు వెల్లడించారు.
అసోంలోని నామ్‌రూ ప్‌లో రూ.10,601 కోట్లతో కొత్తగా బ్రౌన్ ఫీల్డ్ అమ్మో ప్లాంట్‌ను నిర్మించాలని ప్రభు నిర్ణయం తీసుకున్న ట్టు పేర్కొన్నారు. బ్రహ్మపుత్ర వ్యాలీ ఫెర్టిలైజ ర్ కో లిమిటెడ్ నేతృత్వంలోని ఈ ప్రాజెక్ట్ ద్వారా ఏటా 12.7లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా పెట్టు దిగుమతులపై ఆధార పడటాన్ని తగ్గించి, ఈశాన్య ప్రాంత రైతులకు సమయానికి ఎరువులను అందించడం కో సం కేవలం 48 నెలల్లో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది.