కేంద్రం నిర్ణయం
న్యూఢిల్లీ, డిసెంబర్ 22: ప్రభుత్వ రంగ ఆర్థిక సంస్థ ఐఎఫ్‌సీఐకి తాజాగా రూ.500 కోట్ల మూలధనాన్ని సమకూర్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్‌సీఐ) ప్రతిపాదిత పునర్‌వ్యవస్థీకరణ జరిగే ముందుగానే ఆ సంస్థ ఆర్థిక స్థితిని మెరుగుపర్చేందుకు కేంద్రం మూలధన పెట్టుబ డులు చేయనుంది.
ఈ పెట్టుబడులతో ఐఎఫ్‌సీఐలో ప్రస్తుతం ప్రభుత్వానికి ఉన్న 71.72 శాతం నుంచి మరింత పెరుగుతుం ది. గతవారం లోక్‌సభలో ఆమోదం పొందిన సప్లిమెంటరీ డిమాండ్ ఫర్ గ్రాం ట్స్‌లో ఐఎఫ్‌సీఐలో పెట్టుబడులకు రూ. 499 కోట్లు కేటాయించారు. ఈ ఏడాది తొలినాళ్లలో ఐఎఫ్‌సీఐ ప్రభుత్వానికి ఈక్విటీ షేర్లను జారీచేయడం ద్వారా రూ. 500 కోట్లు సమీక రించింది.
ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఐఎఫ్‌సీఐ రూ.22 కోట్లు, ప్రధమా ర్థంలో రూ. 170 కోట్ల చొప్పున నష్టాల్ని చవిచూసింది. కంపె నీ పునరుద్ధరణ, పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా ఐఎఫ్‌సీఐ గ్రూప్ సంస్థలను విలీ నం చేసే ప్రతిపాదనను గత నెలలో కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ ఆమోదించింది.
ఈ ప్రతిపాదన ప్రకా రం ఐఎఫ్‌సీఐతో స్టాక్‌హోల్డింగ్ కార్పొరేషన్, ఐఎఫ్‌సీఐ ఫ్యాక్టర్స్, ఐఎఫ్‌సీఐ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్‌ట, ఐఐడీఎల్ రియాల్టర్స్‌లను విలీనం చేస్తారు.
అలాగే స్టాక్‌హోల్డింగ్ సర్వీసెస్, ఐఎఫ్‌సీఐ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐఎఫ్‌ఐఎన్ కమోడిటీస్, ఐఎఫ్‌ఐఎన్ క్రెడిట్‌లను ఒక కంపెనీగా విలీనం చేసి, దానిని ఐఎఫ్‌సీఐ లిమిటెడ్‌కు సబ్సిడరీగా మారుస్తారు. 1948లో చట్టం ద్వారా ఏర్పాటైన ఐఎఫ్‌సీఐకి పలు సబ్సిడరీలు, జాయింట్ వెంచర్లు ఉన్నాయి.