11-03-2025 12:31:52 AM
పరిహారం ఇచ్చి ఆదుకోవాలి మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి డిమాండ్
పెన్‌పహాడ్, మార్చి 10 : ఎస్సారెస్పీ నీళ్ళు వస్తాయని ఆశతో పెట్టుబడులు పెట్టి పంటలు సాగు చేసుకున్నారని తీరా నోటికాడికి వచ్చే లోపు నీళ్ళు సరిగా రాక పంటలు ఎండి రైతన్నలు అప్పుల ఊబిలో కూరుకు పోయారని.. ఆత్మహత్యలకు దారి తీయకుండా ప్రభుత్వం వెంటనే ఎండిన పంటలకు పరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. సోమవారం మండలంలో గూడెపుకుంటతండాకు చెందిన బీఆర్‌ఎస్ నాయకులు భూక్యా రవీందర్ మాతృమూర్తి బంగారి అకాల మరణం చెందగా ఆకుటుంబాన్ని పరామర్శించి విలేకర్లతో మాట్లాడారు.
ప్రభుత్వానికి రైతన్నలపై చిత్తశుద్ధి లేదని యాసంగి పంటలపై సరియైన ప్రణాళికలు రూపొందించడంలో పాలకులు, అధికారులు పూర్తిగా విఫలం అయ్యారన్నారు. ఈ కార్యక్రమములో మాజీ గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్, మండలాధ్యక్షుడు దొంగరి యుగేందర్, మాజీ ఎంపీపీ నెమ్మాది బిక్షం, పీఏసీఏస్ చైర్మన్ వెన్న సీతారాంరెడ్డి, తూముల ఇంద్రసేనారావు, మిర్యాల వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.