calender_icon.png 3 April, 2025 | 8:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెట్టుబడి ఆదా..

28-03-2025 01:11:51 AM

  1.  నాలుగైదు క్వింటాళ్ల ధాన్యం దిగుబడి అధికం
  2. విత్తనాలు వెదజల్లే పద్ధతిలో వరిసాగు చేస్తే ఎన్నో లాభాలు
  3. రైతుకు ఎకరానికి రూ.8వేలు మిగులు..
  4. మల్యాల కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ మాలతి

మహబూబాబాద్, మార్చి 27: (విజయక్రాంతి): విత్తనాలు వెదజల్లే పద్ధతిలో రైతులకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని మల్యాల కృ షి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ మాలతి తెలిపారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం ఊట్లలో గురువారం మల్యాల కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో నేరుగా విత్తనాలు వెదజల్లే పద్ధతిలో వరిసాగుపై క్షేత్ర దినోత్సవాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా డాక్టర్ మాలతి మాట్లాడుతూ.. నేరుగా విత్తనాలు వెదజల్లే పద్ధతిలో ఎకరానికి రూ.8వేలు ఆదా అవుతుందని చెప్పారు. నాలుగైదు క్వింటాళ్ల ధాన్యం దిగుబడి కూడా పెరుగుతుందని తెలిపారు. ఈ పద్ధతి ద్వారా రైతుకు సమయం కూడా ఆదా అవుతుందన్నారు. నెల రోజుల సమయం ఆదా కావడం వల్ల యాసంగి పంటలో నీటి ఎద్దడి బాధ తప్పుతుందన్నారు. ఊట్లలో వెదజల్లే పద్ధతిలో 80 నుంచి 85శాతం  వరిసాగును చేపట్టినందుకు రైతులను అభినందించారు.

ఈ విస్తీర్ణం వంద శాతం చేరి మహబూబాద్ జిల్లాలో ఊట్ల గ్రా మం ఆదర్శంగా నిలవాలని కొనియాడారు. ఊట్లను దత్తత తీసుకున్న కేవీకే, వ్యవసాయ శాఖ అనుబంధాలతో రైతులకు నూతన పద్ధతుల్లో సాగుపై అవగాహన కల్పిస్తోందన్నారు. నేరుగా విత్తనాలు వెదజల్లే పద్ధతిలో వరిసాగు, జనుము విత్తనోత్పత్తి, మిరపసాగులో వేప నూనె జిగురు అట్ట లు.. వంటివి ఆధునాతన విధానాలు పాటిస్తూ సాగుఖర్చును తగ్గించుకోవాలని ఆమె సూచించారు.

జిల్లా సహా వ్యవ సాయ సంచాలకుడు శ్రీనివాసరావు మాట్లాడు తూ.. రైతులు కేవలం వ్యవసాయమే కాకుండా వ్యవసాయ అనుబంధ రంగాల ఆదాయం పెంచుకోవచ్చని సూచించారు. సే. కార్యక్రమంలో కేవీకే ఉద్యాన శాస్త్రవేత్త రాంబాబు, గూడూరు మండల వ్యవసాయ అధికారి అబ్దుల్ మాలిక్, గూడూరు క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారి అలేఖ్య పాల్గొన్నారు.