calender_icon.png 24 January, 2025 | 4:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెట్టుబడుల వెల్లువ

24-01-2025 01:47:38 AM

1.78 లక్షల కోట్లు 49 వేల కొలువులు

  1. దావోస్ వేదికగా మొత్తం 20 కంపెనీలతో ఒప్పందాలు
  2. ఐటీ, ఏఐ, ఇంధన రంగాల్లో భారీగా పెట్టుబడులు
  3. చివరిరోజు 13కంపెనీలతో ఒప్పందం
  4. రూ.60వేల కోట్లతో ‘అమెజాన్’తో భారీ ఒప్పందం
  5. డాటా సెంటర్ల విస్తరణకు విప్రో, ఇన్ఫోసిస్ సై.. 
  6. ‘తెలంగాణ రైజింగ్’ వ్యూహం సక్సెస్
  7. దావోస్‌లో ముగిసిన పర్యటన
  8. గతేడాదితో పోలిస్తే నాలుగు రెట్లకు పైగా పెట్టుబడులు

యునీలివర్: ఆయిల్ పామ్ ప్రాసెసింగ్, కామారెడ్డి

హెచ్‌సీఎల్ టెక్: ఐటీ స్పేస్ విస్తరణ

ఇన్ఫోసిస్: పోచారం క్యాంపస్  విస్తరణ

విప్రో: గోపనపల్లి  క్యాంపస్ విస్తరణ

సుహానా మసాలా: మిరప రైతుల  శిక్షణ కేంద్రం

ఎక్లాత్ హెల్త్ సొల్యూషన్స్:  ఐటీ ఆఫీస్ విస్తరణ


హైదరాబాద్, జనవరి 23 (విజయక్రాంతి): దావోస్‌లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరం(World Economic Forum in Davos) (డడ్ల్యూఈఎఫ్) వేదికగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Revanth Reddy) , ఐటీ, పరిశ్ర మల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు(Duddilla Sridhar Babu) సారథ్యంలోని ‘తెలంగాణ రైజింగ్’(Telangana Rising) ప్రతినిధుల బృందం మూడు రోజుల్లోనే రూ.1.78 లక్షల కోట్ల పెట్టుబడు లు సాధించింది.

మొత్తం 20 కంపెనీలతో ఒప్పందా లు చేసుకుని 49 వేల కొలువుల కల్పనకు బాటలు వేసింది. రాష్ట్రప్రభుత్వం ఆశించిన విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(Intelligence, Green Energy) (ఏఐ), గ్రీన్ ఎనర్జీ(Green Energy), డేటాసెంటర్ సెక్టార్లకు భారీగా పెట్టుబడులు వచ్చేస్తున్నాయి.

అమెజాన్ సంస్థ -రూ.60 వేల కోట్లు, సన్ పెట్రో కెమికల్స్ -రూ.45,500 కోట్లు, టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ -రూ. 15,000 కోట్లు, మేఘా ఇంజినీరింగ్ కంపెనీ - రూ.15,000 కోట్లతో అతిపెద్ద వాటాలు కలిగి ఉన్నాయి. గతేడాది దావోస్ పర్యటనలో రాష్ట్రానికి రూ.40,232 కోట్ల పెట్టుబడులు రాగా.. ఈసారి నాలుగు రెట్లకుపైగా పెట్టుబడులు రావడం విశేషం. 

‘ఇన్ఫోసిస్’ విస్తరణ.. కొత్తగా 17,000 ఐటీ ఉద్యోగాలు

దిగ్గజ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ హైదరాబాద్‌లోని తమ క్యాంపస్‌ను విస్తరణకు ముం దుకొచ్చింది. విస్తరణ ద్వారా పోచారం క్యాం పస్‌లో అదనంగా 17వేల ఉద్యోగాలు కల్పించనున్నది. ఈ మేరకు కంపెనీ రాష్ట్రప్రభు త్వంతో ఒప్పందం చేసుకున్నది. దీనిలో భాగంగా కంపెనీ రూ. 750 కోట్ల పెట్టుబడితో కొత్త ఐటీ భవనాలు నిర్మించనున్నది. మూడేండ్లలో నిర్మాణం పూర్తి చేయనున్నది.

‘టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్’ రూ.15,000 కోట్ల పెట్టుబడులు..

హైదరాబాద్‌లో అత్యాధునిక డేటా సెం టర్‌ను అభివృద్ధి చేసేందుకు అమెరికాకు చెందిన ‘టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్’ సంస్థ ముందుకొచ్చింది. రూ.15,000 కోట్ల పెట్టుబడితో 300 మెగావాట్ల సామర్థ్యంతో హైదరాబాద్‌లో డేటా సెంటర్ ఏర్పాటు చేయనున్నది. సంస్థ ప్రెసిడెంట్ సచిత్ అహుజాతో ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు సమక్షంలో ఒప్పందంపై సంతకాలు చేశారు.

‘ఉర్సా క్లస్టర్స్’ రూ.5 వేల కోట్ల పెట్టుబడులు

అమెరికాకు చెందిన ‘ఉర్సా క్లస్టర్స్’ కంపె నీ రాష్ట్రంలో అత్యాధునిక అర్టిఫిషియల్ డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు రాష్ట్రప్రభుత్వంతో ఒప్పందం  చేసుకున్నది. కంపెనీ సీవోవో సతీశ్ అబ్బూరి, సీఆర్‌వో ఎరిక్ వార్నర్ ఒప్పందంపై సంతకం చేశారు. సంస్థ హైదరాబాద్‌లో 100 మెగావాట్లతో డేటా సెంటర్ ఏర్పాటు చేయనున్నది. ప్రాజెక్టుపై రూ.5000 కోట్లు పెట్టుబడి పెట్టనున్నది.  

‘మైత్రా ఎనర్జీ’ గ్రూప్ --సోలార్ సెల్స్ తయారీ యూనిట్

అత్యాధునిక సోలార్ సెల్స్, మాడ్యూల్స్ తయారీ యూనిట్ స్థాపించేందుకు మైత్రా ఎనర్జీ గ్రూప్ కంపెనీ అక్షత్ గ్రీన్ టెక్ రాష్ట్రప్రభుత్వంతో గురువారం ఒప్పందం చేసుకుంది. చర్చల్లో సంస్థ డైరెక్టర్  గిరీష్ గెల్లి పాల్గొన్నారు. ప్రాజెక్టుపై ఏకంగా రూ.7,000 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నది. ప్రాజెక్ట్ ద్వారా 2,500 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. పరోక్షంగా మరింత మందికి ఉపాధి లభించనున్నది.

హైదరాబాద్‌లో ‘ఎక్లాట్ హెల్త్’ కొత్త ఆఫీస్

‘ఎక్లాట్ హెల్త్’ సొల్యూషన్స్ సంస్థ తెలంగాణలో మరో కార్యాలయం ఏర్పాటు చేయ నున్నది. ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబుతో ఎక్లాట్ కంపెనీ సీఈవో కార్తీక్ పోల్సానితో సమావేశమై ఈ ఒప్పందం చేసుకున్నారు. ఆఫీస్ విస్తరణలో భాగంగా ఏప్రిల్ 2025 నాటికి కొత్త ఆఫీస్ అందుబాటులోకి రానున్నది. దీంతో వందలాది మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. 

సుగంధ ద్రవ్యాల ఉత్పత్తి ఎక్స్‌లెన్స్ సెంటర్

తెలంగాణలో సుగంధ ద్రవ్యాల ఉత్పత్తి ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు సుహానా మసాలా, ఎకో ఫ్యాక్టరీ ఫౌండేషన్ సంయుక్తంగా రాష్ట్రప్రభుత్వంతో దావోస్‌లో ఒప్పందం చేసుకున్నాయి. ‘సుహానా’ డైరెక్టర్ ఆనంద్ చోర్డియా, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు చర్చలు సఫలం కావడంతో ఒప్పందం ఓకే అయింది. సంగారెడ్డి సుహానా ప్లాంట్ పక్కనే కొత్తగా ఎక్స్‌లెన్స్ సెంటర్ రూపుదిద్దుకోనున్నది. రానున్న రెండు మూడేండ్లలో సెంటర్‌లో 25 వేల నుంచి 30 వేల మంది రైతులు సుగంధ ద్రవ్యాల సాగు, సాగు పద్ధతులపై శిక్షణ పొందుతారు.

పర్యటన గ్రాండ్ సక్సెస్: సీఎంవో

2025 దావోస్ టూర్ గ్రాండ్ సక్సె స్ అయిందని  సీఎంవో పేర్కొన్నది. సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి  నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధుల బృందం రాష్ట్రానికి రూ.1.78 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి, కొత్త 49 వేల ఉద్యోగాల కల్పనకు బాటలు వేసిందని పేర్కొన్నది. బృందం గురువారం అర్ధరాత్రి దావోస్ నుంచి బయల్దేరి హైదరాబాద్‌కు చేరుకోనున్నది.

‘అమెజాన్’ రూ.60 వేల కోట్ల పెట్టుబడులు..

తెలంగాణ రైజింగ్ బృందం గురువారం ఒక్కరోజే 13 కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నది. దీనిలో భాగంగా ప్రపంచ దిగ్గజ కంపెనీ అమెజాన్ సంస్థ హైదరాబాద్‌లో రూ.60 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. దావోస్‌లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు ఈ మేరకు సంస్థ వెబ్ సర్వీసెస్ గ్లోబల్ పబ్లిక్ పాలసీ వైస్ ప్రెసిడెంట్ మైఖేల్ పుంకేతో భేటీ అయి ఒప్పందం చేసుకున్నారు. 

ఒప్పందంలో భాగంగా సంస్థ భారీగా డేటా సెంటర్లను విస్తరించనున్నది. రాష్ట్రప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)పై స్పెషల్ ఫోకస్ పెట్టిన వేళ.. అమెజాన్ పెట్టుబడులు ఆశాజనకంగా ఉన్నాయి. సంస్థ ఇప్పటి కే రాష్ట్రంలో మూడు సెంటర్లను అభివృద్ధి చేసింది. కొత్తగా ఏర్పాటు చేయ నున్న డాటా సెంటర్లతో  హైదరాబాద్‌కు కొత్త ఇమేజ్ సాధించనున్నది.

గోపనపల్లి ‘విప్రో’ ఐటీ క్యాంపస్ విస్తరణ

గోపనపల్లిలోని విప్రో క్యాంపస్ విస్తరణకు కంపెనీ ముందుకు వచ్చిం ది. ఇక్కడ కొత్తగా మరో ఐటీ సెంటర్ నెలకొల్పనున్నది. తద్వారా 5000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు లభిస్తాయి. ఈ మేరకు కంపెనీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ రాష్ట్రప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు.

వచ్చే రెండు మూడేండ్లలో క్యాంపస్ అందుబాటులోకి రానున్నది. ఈ సందర్భంగా మం త్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. యంగ్ ఇండియా స్కిల్స్ వర్సిటీతో పాటు ప్రభు త్వం అమలు చేస్తున్న నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల్లోనూ కంపెనీ భాగస్వామి కోవాలని కోరారు.

‘బ్లాక్ స్టోన్’ కంపెనీ రూ.4,500 కోట్ల పెట్టుబడులు..

ప్రపంచ అగ్రగామి సంస్థ బ్లాక్‌స్టోన్ హైదరాబాద్‌లో డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. రూ.4,500 కోట్ల పెట్టుబడితో 150 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటు చేయనున్నది. ఈ ఒప్పందంపై బ్లాక్‌స్టోన్ సంస్థ ప్రతినిధులు సంతకం చేశారు. ఇంధన సామర్థ్యం, అధునాతన శీతలీకరణ వ్యవస్థలు, సైబర్ భద్రతా ప్రోటోకాల్ అవసరాలకు సంబంధించి ఏఐ ఆధారిత సేవలను డేటా సెంటర్ అందిచనున్నది.