calender_icon.png 7 February, 2025 | 11:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దావోస్‌లో పెట్టుబడుల బొనాంజా!

29-01-2025 12:00:00 AM

తెలంగాణలో పెట్టుబడుల కోసం  దావోస్ వేదికను కాంగ్రెస్ ప్రభు త్వం విజయవంతంగా వినియోగించుకుం ది. రాష్ట్రం అన్ని రంగాల్లో వేగంగా పురోగ తి సాధించాలంటే ఆర్థిక రంగం బలపడా లని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం రా ష్ట్రంలో భారీ పెట్టుబడుల కోసం చేసిన కృ షి దావోస్‌లో ఫలించింది.

గతేడాది దావోస్‌లో రూ.40 వేల కోట్లకు పైగా పెట్టుబడు లు సాధించిన ప్రభుత్వం ఈ సారి రెట్టింపు స్థాయిని దాటి రూ.1.78 లక్షల కోట్ల పెట్టుబడులు రాబట్టడం కాంగ్రెస్ పనితీరుకు, నిబద్ధతకు నిదర్శనం. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో రూ.25 వేల కోట్ల పెట్టుబడులు రాగా, కాంగ్రెస్ ఏడాదిన్నర పాలనలో రూ.2 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు సా ధించిందని చెప్పుకోవడానికి మేమెంతో గర్విస్తున్నాం.

ప్రపంచ ఆర్థిక వేదికైన దావోస్‌లో జరిగిన సమావేశాన్ని సద్వినియోగం చేసుకో వాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యూ హాత్మకంగా వ్యవహరించడంతో రాష్ట్రానికి పెట్టుబడులు వరదలా వచ్చాయి. రాష్ట్రం లో  పెట్టుబడులను ఆహ్వానించడంతో పా టు యువతకు ఉపాధి కల్పించాలనే దీర్ఘ కాలిక లక్ష్యంతో ప్రభుత్వం తీసుకొచ్చిన ‘తెలంగాణ రైజింగ్ 2050 విజన్’ దావోస్ లో రాష్ట్రానికి పెట్టుబడుల ఊతమిచ్చింది.

రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్ పరిధిలో ఫ్యూచర్‌సిటీతోపాటు, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేస్తుండడంతో ప్రపంచంలోని ప్రముఖ సంస్థలు తెలంగాణలో పెట్టుబడులకు ఆసక్తి చూపా యి. అంతేకాక రీజినల్ రింగ్ రోడ్డు నిర్మా ణం, నగరంలో మెట్రో రైలు విస్తరణ ప్రతిపాదనలు కూడా పెట్టుబడులకు వరంగా మారాయి.  

క్యూ కట్టిన ప్రముఖ కంపెనీలు

ప్రభుత్వం సకల సదుపాయాలు కల్పించడంతో రాష్ట్రంలో పెట్టుబడుల కోసం దావోస్ సమావేశంలో తెలంగాణ పెవిలియన్ వద్ద ప్రసిద్ధ కంపెనీలు క్యూ కట్టాయి. ప్రముఖ ఐటీ, ఎనర్జీ, సోలార్, ఎయిర్‌స్పేస్, మౌలిక సదుపాయాల కల్పన, ఫా ర్మా, హెల్త్ రంగాలకు చెందిన పలు కంపెనీలు పెట్టుబడులకు క్యూ కట్టాయి.

దావో స్‌లో16 సంస్థలతో రూ.1.78 లక్షల కోట్ల పెట్టుబడుల కోసం ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోవడంతో 50 వేలకు పైగా ఉ ద్యోగాలు కూడా రావడమే కాక, రాష్ట్రంలో రియల్ ఎస్టేట్‌కుకూడా బూమ్ వచ్చే అవకాశాలున్నాయి.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం చేసిన కృషితో  దావోస్ వేదికగా అమెజాన్ వెబ్ సర్వీసెస్ రూ.60 కోట్ల పెట్ట్లుబడులతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ సర్వీసెస్ అండ్ డేటా సెంటర్ ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చాయి.

సన్ పెట్రోల్ కెమికల్స్ రూ.45,500 కోట్ల పెట్టుబడులకు ముందుకు రావడంతో 7 వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. ఎజిలిటి కంపెనీ రూ.400 కోట్ల పె ట్టుబడులకు ఆమోదం తెలిపింది. ఇన్ఫోసిస్ రూ.750 కోట్ల పెట్టుబడులకు సమ్మ తించడంతో 17 వేల మందికి  ఉద్యోగాలు రానున్నాయి.

విప్రో కంపెనీ పెట్టుబడుల తో మరో ఐదు వేల మందికి ఉపాధి రా నుంది. హెచ్‌సీఎల్ టెక్ సెంటర్ కూడా రా ష్ట్రంలో పెట్టుబడులపై ఆసక్తి చూపింది. ఇ లా పలు ప్రముఖ కంపెనీలు తెలంగాణ లో పెట్టుబడుల కోసం ముందుకు రావడం ప్రభుత్వం సాధించిన విజయంగా చెప్పుకోవచ్చు.  

గత ఏడాది ఒప్పందాలకు కార్యరూపం

దావోస్‌లో పెట్టుబడులు ఆకర్షించడం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది మొదటిసారి కాదు. గతేడాది కూడా దావోస్ వేదికగా కాంగ్రెస్ సర్కార్ భారీగానే పెట్టుబడులు సాధించింది. పెట్టుబడులు తెచ్చినట్టు ప్రకటనలకే పరిమితం కాకుండా కంపెనీల స్థాపన కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలక నినాదమైన నిధులు, నియామకాలు, నీళ్లు ఆశ యాలు రాష్ట్రం ఏర్పడి దశాబ్ద కాలం పూర్తయినా ఆశించిన మేరకు నెరవేరలేదు.

ని ధులు, నియామకాల ఆశయాలు అందుకోవడానికి రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్ర మలు రావాల్సిన ఆవశ్యకత గుర్తించిన ప్ర భుత్వం మొదటి ఏడాది పాలనలో వేగవంతమైన నిర్ణయాలు తీసుకోవడంతో ఆ ఫ లాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. గతేడాది దావోస్ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలతో తెలంగాణకు రూ.40,233 కోట్ల పెట్టుబడులు వచ్చా యి. 

గత ఏడాది వచ్చిన పెట్టుబడులపై ఒ ప్పందాలు కుదుర్చుకొని చేతులు దులుపుకోకుండా, పరిశ్రమల ఏర్పాటుకు  రేవంత్ సర్కార్ గట్టి పట్టుదలతో రాష్ట్రంలో అనుకూలమైన వాతావరణం కల్పించడంతో గతేడాది  సమావేశంలో 14 కంపెనీలతో తెలంగాణ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒ ప్పందాలు కార్యరూపం దాలుస్తున్నాయి.

ఈ కంపెనీలు 18 ప్రాజెక్టుల ఏర్పాటుకు ముందుకురాగా, వాటిలో 17 పనులు ప్రా రంభమై, వివిధ దశల్లో ఉన్నాయి. వీటిలో 10 ప్రాజెక్టుల పనులు వేగవంతంగా సాగుతూ ముగింపు దశలో ఉన్నాయి. 

 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ

రాష్ట్రంలో ఐటీ సంస్థలు, పరిశ్రమలను స్థాపించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూ పొందించిన ప్రభుత్వం గ్రేటర్‌లో హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్‌కు తోడు గా ఇప్పుడు ‘ఫ్యూచర్ సిటీ’ పేరుతో నాలు గో సిటీని తీర్చిదిద్దుతోంది.

30 వేల ఎకరాల్లో ఏర్పాటు కానున్న ఈ ఫ్యూచర్ సిటీ లో రైతులు నష్టపోకుండా వారి సమ్మతితోనే భూములు సేకరించి, మెరుగైన పరి హారం ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా రై తులు కోల్పోతున్న భూమి విలువకు స మానంగా అభివృద్ధి చేసిన ప్లాట్లను ఇవ్వాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించడంతో అన్నదాతలు కూడా ఆనందంగా ఉన్నారు.

ఫ్యూచర్ సిటీ కోసం మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో భూములను పరిశీలించిన ప్రభు త్వం 6 మండలాల్లో భూములు సేకరించి, ఇక్కడ ఐటీ అభివృద్ధితో పాటు యాపిల్ ఫోన్ విడిభాగాల పరిశ్రమ, ఎలక్ట్రిక్ ఈవీ బస్సుల తయారీ యూనిట్, టెక్సెటైల్ పరిశ్రమలకు ప్రాధాన్యతివ్వాలని నిర్ణయించిం ది.

ఇక్కడ ప్రతిష్ఠాత్మకమైన విద్యా సంస్థ లు, రెస్టారెంట్లు, వినోద కార్యక్రమాలను ప్రారంభించడంతో పాటు రేస్ క్లబ్, గోల్ఫ్ క్లబ్, ట్రేడ్ సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. గతంలో ప రిశ్రమల కోసం భూములు తీసుకొని ప నులు ప్రారంభించక కాలయాపన చేస్తున్న కంపెనీల నుండి ఆ స్థలాలను వెనక్కి తీసుకునేలా నియమ నిబంధనలు  రూపొం దించిన ప్రభుత్వం భూములు దుర్వినియో గం కాకుండా కఠిన చర్యలు తీసుకుంది.

పరిశ్రమల ఏర్పాటు, పెట్టుబడులే ల క్ష్యంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణతో పాటు ఇత ర అంశాలపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టిం ది. ప్రధానంగా ఫార్మా కంపెనీలతో కాలు ష్య ముప్పు రాకుండా చర్యలు చేపట్టింది. ఫ్యూచర్ సిటీలో ఫార్మాకంపెనీలకు కాలు ష్య రహిత హామీతోనే భూములను కేటాయించాలని నిర్ణయించడం స్వాగతించాల్సి న అంశం.

కాలుష్యం లేకుండా పరిశోధన చేసే సంస్థలకు, బయటినుండి ముడి స రుకు తీసుకొచ్చి ఔషధాలు తయారు చేసే సంస్థలకే స్థలాలివ్వాలని ప్రభుత్వం నిర్ణయించడంతో భూములివ్వడానికి స్థానికు లు సానుకూలంగా ముందుకొస్తున్నారు. ఇప్పటికే పలు నోటిఫికేషన్లతో 50 వేలకుపైగా ఉద్యోగాలను భర్తీ చేసిన ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటుతో మరిన్ని ఉద్యోగ అ వకాశాలను కల్పించాలనే పట్టుదలతో ఉం ది.

పరిశ్రమలు ఏర్పాటు చేసే ప్రాంతా ల్లో భూములు కోల్పోయిన వారితో పాటు స్థానికులకు ప్రాధాన్యతిచ్చేలా ప్రత్యే క చ ర్యలు తీసుకుంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణలో పెట్టుబడులు కాం గ్రెస్‌తోనే సాధ్యమని దావోస్ వేదికగా మ రోసారి రుజువైంది. మునుపెన్నడూ లేని విధంగా రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చిన కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తున్న బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనకంటే కాంగ్రెస్  సర్కార్ తీసుకొచ్చిన పె ట్టుబడులు భారీగా ఉన్నాయని గణాంకా లే తేటతెల్లం చేస్తున్నాయి.

రాష్ట్ర అభివృద్ధి కి పరిశ్రమలు సోపానాలుగా మారుతాయనే దృఢ సంకల్పంతో రాష్ట్రంలో పెట్టు బడులే లక్ష్యంగా కీలక నిర్ణయాలు తీసు కుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం రెండోసారి వరుసగా దావోస్ వేదికను విజయవంతంగా వినియోగించుకొని రాష్ట్రాన్ని ప్రగతి పథంలో పరిగెత్తించేందుకు కృషి చేస్తోంది.

వ్యాసకర్త టీపీసీసీ అధ్యక్షులు