సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం ‘మధ’తో మెప్పించిన దర్శకురాలు శ్రీవిద్య బసవ ‘హత్య’ అనే మరో థ్రిల్లర్ సినిమాతో మరోమారు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇందులో ధన్య బాలకృష్ణ, పూజా రామచంద్రన్, రవివర్మ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నా రు. మహాకాళ్ పిక్చర్స్ పతాకంపై ఎస్ ప్రశాంత్‌రెడ్డి నిర్మి స్తున్న ఈ చిత్రం జనవరి 24న రిలీజ్‌కు రెడీ అవుతోంది.
ఈ నేపథ్యంలో గురువారం ఈ మూవీ టీజర్ విడుదల కార్యక్రమాన్ని మేకర్స్ హైదరాబాద్‌లో నిర్వహించారు. నటుడు రవివర్మ టీజర్‌ను విడుదల చేసి మాట్లాడారు. ‘శ్రీవిద్య నన్ను లుక్ టెస్ట్ చేసి రొటీన్‌కు భిన్నమైన ఈ రోల్‌కు ఎంపిక చేసుకుంది. శ్రీవిద్య కొత్త టైప్ ఆఫ్ మేకింగ్‌కు తెర తీసింది. అందరినీ ఎంగేజ్ చేసే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఇది’ అని తెలిపారు.
నటి పూజా రామచంద్రన్ మాట్లాడుతూ “నాకు కొడుకు పుట్టిన తర్వాత నటించిన తొలి సినిమా ఇది. సినిమానంత మార్చేసే చాలా ముఖ్యమైన పాత్రలో నటించాను’ అన్నారు. డైరెక్టర్ శ్రీవిద్య మాట్లాడుతూ.. ‘రవివర్మను దృష్టిలో పెట్టుకుని స్క్రిప్ట్ రాసుకున్నాను. ఆయన నెక్ట్స్ లెవల్ యూనిక్ క్యారెక్టర్‌లో కనిపిస్తారు’ అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ నరేశ్ కుమారన్, ఎడిటర్ అనిల్‌కుమార్ పాల్గొన్నారు.