calender_icon.png 6 March, 2025 | 8:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫోక్సో, గ్రేవ్ కేసుల్లో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయాలి

06-03-2025 05:59:06 PM

నేరాల నివారణ, నేర చేదనే లక్ష్యంగా పని చేయాలి..

జిల్లా ఎస్పీ సింధు శర్మ..

కామారెడ్డి (విజయక్రాంతి): ఫోక్సొ గ్రేవ్ కేసులను త్వరితగతిన పరిష్కరించే విధంగా అధికారులు కృషి చేయాలని జిల్లా ఎస్పీ సిందూ శర్మ అన్నారు. గురువారం ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో నెలవారీ నేర సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న పోలీస్ అధికారులతో ఎస్పీ సిందూ శర్మ మాట్లాడుతూ.. పెండింగ్ (అండర్ ఇన్వెస్టిగేషన్) లో ఉన్న గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు నుండి చార్జిషీట్ వరకు ప్రతి విషయాన్ని పరిశోధన చేసి ఫైనల్ చేయాలన్నారు. ప్రతి అధికారికి పూర్తి ఇన్వెస్టిగేషన్, స్టేషన్ మేనేజ్మెంట్ తెలిసి ఉండాలని సూచించారు. అవసరమైతే సంబంధిత న్యాయమూర్తులను స్వయంగా కలిసి కేసుల పరిష్కారానికి మరింత చొరవ చూపాలని సూచించారు.  

కొత్త కేసులతో పాటు చాలా కాలంగా పెండింగ్ కేసులను ఎప్పటికప్పుడు సమీక్షించడం ద్వారా కేసుల సంఖ్య తగ్గించే దిశగా అన్ని స్థాయిల అధికారులు పని చేయాలన్నారు. కమ్మునిటీ పోలిసింగ్ ద్వారా గ్రామాలలో సిసిటీవిల యొక్క ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తూ ఏర్పాటుకు కృషి చేయాలని అన్నారు. సైబర్ క్రైమ్, డయల్ 100 వాటి వినియోగంపై విద్యార్థులు, ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రమాదాలు జరగకుండా ప్రతీ రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ లు నిర్వహించాలని అన్నారు. అసాంఘిక కార్యకలాపాలు గంజాయి, జూదం, అక్రమ ఇసుక పి.డి.యస్ రవాణా లాంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారించి పటిష్టమైన చర్యలు తీసుకోని నియంత్రించాలని అన్నారు. విధులలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన పోలీసు అధికారులు, సిబ్బందిని గుర్తించి వారికి ఎస్‌పి ప్రశంస పత్రాలను అందజేశారు.

మాచారెడ్డి ఎస్ఐ అనిల్ కుమార్, ఎల్లారెడ్డి ఏఎస్ఐ గంగారెడ్డి, భిక్కనూర్ ఉమెన్ కానిస్టేబుల్ ప్రియాంక, బిబిపేట కానిస్టేబుల్ రాములు, విజయ్, కామారెడ్డి, ఉమెన్ కానిస్టేబుల్ శిరీష, నవీన్, శ్రీనివాస్ తాడువాయి కానిస్టేబుల్ సాయిబాబా, భవిత ఉమెన్ కానిస్టేబుల్, నాగిరెడ్డిపేట్ కానిస్టేబుల్ చంద్రయ్య, పెద్ద కొడపుగల్ కానిస్టేబుల్ రవీందర్, నదీమ్, నస్రుల్లాబాదుకు చెందిన కానిస్టేబుళ్లు వేంకటేశ్వర్లు, జావిద్ లను ఎస్పి సింధు శర్మ ప్రశంస పత్రాలను అందజేసి అభినందించారు. ఈ సమావేశంలో కామారెడ్డి ఏఎస్పీ చైతన్య రెడ్డి, అడిషనల్ ఎస్పీ అడ్మిన్ కే నరసింహారెడ్డి, డీఎస్పీలు సత్యనారాయణ, శ్రీనివాసులు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ తిరుపయ్య, డిసిఆర్బి ఇన్స్పెక్టర్ మురళి, సీఐలు, ఆర్ఐలు ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు.