యాదాద్రి భువనగిరి: (విజయక్రాంతి): భువనగిరి ఎక్సైజ్ అధికారుల బృందం శనివారం భువనగిరి మండలంలోని వివిధ తండాలలో విస్తృత తనిఖీలు, సోదాలు నిర్వహించారు. మండలంలోని ఆకుతోటబాయి తండా పచ్చర్లబోడు తండా గ్రామాలలో విస్తృత సోదాలు నిర్వహించి అక్రమంగా నాటు సారాయిని తయారు చేయడం, నిల్వవుంచడం విక్రయించడం నేరం అని తెలిపారు. అలాంటి వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు . నాటు సారాయి తాగడం వల్ల కలిగే అనర్థాలను వారికి వివరించి వారికి అవగాహన కల్పించారు. ఈ సోదాలలో ప్రోహిబిషన్, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ పి. నరేందర్ తో పాటు ఎక్సైజ్ ఎస్సై కె గణసిబ్బంది పాల్గొన్నారు.