ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి పోలీస్, అధికారులు, సిబ్బంది పని చేయాలి
హిస్టరి షీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచాలి
సీఈఐఆర్ పొర్టల్ ద్వారా పొగొట్టుకున్న మొబైల్ ఫోన్ల రికవరీ మరింతగా పెంచాలి
నెలవారి నేర సమీక్షా సమావేశంలో జిల్లా ఎస్పీ సింధుశర్మ
కామారెడ్డి (విజయక్రాంతి): ఫోక్సో, గ్రేవ్ కేసుల్లో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి పోలీస్, అధికారులు, సిబ్బంది పని చేయాలని జిల్లా ఎస్పీ సింధూశర్మ అన్నారు. సోమవారం కామారెడ్డి ఎస్పీ కార్యాలయంలో నెలవారి నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. హిస్టరి షీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచి సీఈఐఆర్ పొర్టల్ ద్వారా పొగొట్టుకున్న మొబైల్ ఫోన్ల రికవరీ మరింతగా పెంచాలన్నారు. పెండింగ్ గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.కేసు నమోదు నుండి చార్జిషీట్ వరకు ప్రతి విషయాన్ని పరిశోధన చేసి పైనల్ చేశారు.
ఫోక్సో, గ్రేవ్‌కేసుల్లో త్వరతిగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి కొర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలన్నారు. ప్రతి అధికారికి పూర్తి ఇన్వెస్టిగేషన్, స్టేషన్ మేనేజ్మెంట్ తెలిసి ఉండాలని సూచించారు. అవసరమైతే సంబంధిత న్యాయమూర్తులను స్వయంగా కలిసి కేసుల పరిష్కారానికి మరింత చొరవ చూపాలని సూచించారు. కొత్త కేసులతో పాటు చాలా కాలంగా పెండింగ్ కేసులను ఎప్పటికప్పుడు సమీక్షించడం ద్వారా కేసుల సంఖ్య తగ్గించే దిశగా అన్ని స్థాయిల అధికారులు పని చేయాలన్నారు. పంక్షనల్స్, వర్టికల్స్ అమలు పరుస్తూ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సమర్థవంతమైన సేవలు అందజేస్తూ సత్వర న్యాయం చేసేలా కృషి చేయాలన్నారు. కమ్యూనిటి పోలీసింగ్ ద్వారా గ్రామాలలో సీసీటివిల యొక్క ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తూ ఏర్పాటుకు కృషి చేయాలన్నారు.
సైబర్ క్రైమ్, డయల్ 100 వాటి వినియోగంపై విద్యార్థులు, ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రమాదాలు జరగకుండా ప్రతి రోజు డ్రంక్ అండ్ డ్రైవ్‌లు నిర్వహించాలన్నారు. జిల్లాలో దొంగతనాలు జరగకుండా పగలు, రాత్రి, సమయాల్లో పెట్రోలింగ్‌లు చేస్తూ నిఘా పెడుతూ విజిబుల్ పోలిసింగ్, పెట్రోలింగ్ ముమ్మరం చేయాలన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మధ్యం సేవించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఆసాంఘీక కార్యకలపాలు, గంజాయి, జూదం, అక్రమ ఇసుక, పీడీఎస్ రవాణా లాంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారించి పటిష్టమైన చర్యలు తీసుకొని నియంత్రించాలన్నారు. విధులలో ఉత్తమ ప్రదర్శన కనబర్చిన పోలీస్ అధికారులు, సిబ్బందిని గుర్తించి వారికి ఎస్పీ అవార్డులు అందజేశారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ కె. నర్సింహరెడ్డి, డిఎస్పీలు నాగేశ్వర్‌రావు, సత్యనారాయన, శ్రీనివాస్‌లు, డిఎస్పీ ఆర్‌బి ఇన్‌స్పెక్టర్ మురళీ, సీఐలు, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.