లగచర్ల రిమాండ్ ఖైదీ హైదరాబాద్ ఆస్పత్రికి తరలింపుపై విచారణ
మల్టీజోన్ 2 ఐజి సత్యనారాయణ
సంగారెడ్డి,(విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా లగచర్లకు చెందిన రిమాండ్ ఖైదీ ఈర్యానాయక్ ఆసుపత్రికి తరలింపులో జైలు అధికారులు రాసిన లేక పై విచారణ చేస్తున్నట్టు తెలిసింది. గురువారం సాయంత్రం సంగారెడ్డి జిల్లాలో కంది గ్రామంలో ఉన్న సెంట్రల్ జైలుకు వెళ్లి విచారణ చేస్తున్నారు. మల్టీ జోన్ 2 ఐజి సత్యనారాయణ, సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేష్ జైల్ లోపటికి వెళ్లారు. ఉదయం సంగారెడ్డి జిల్లా ప్రభుత్వాసుపత్రిలో రైతు ఈర్యాకి బేడీలు వేయడంపై విచారణ చేస్తున్నట్టు సమాచారం. రైతుకు బేడీలు వేయడంపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలని రాష్ట్రప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో జైల్లోకి వెళ్లి విచారణ చేస్తున్నట్టు తెలిసింది.