calender_icon.png 15 January, 2025 | 9:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘దిశ’ కేసు దర్యాప్తు నిష్పక్షపాతంగా ఉండాలి

05-09-2024 01:48:57 AM

హైకోర్టులో కొనసాగిన వాదనలు

హైదరాబాద్, సెప్టెంబర్ 4 (విజయక్రాం తి): దిశ నిందితుల ఎన్‌కౌంటర్ ఘటనపై నమోదైన కేసు దర్యాప్తు నిజాయితీగా, నిష్పక్షపాతంగా జరగాలని, బూటకపు ఎన్‌కౌంట ర్‌లో పాల్గొన్న పోలీసులపై హత్యానేరం కింద ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమో దు చేయాలని హైకోర్టులో బుధవారం వాదనలు కొనసాగాయి. ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన వాళ్లపై పోలీసు కేసు నమోదు అయ్యాయన్నారు.

దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసును సీబీఐకి బదిలీ చేయాలని, పోలీ సులపై కేసు నమోదుకు ఉత్తర్వులు ఇవ్వాలంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యం, ఇతర పిటిషన్లను చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావుతో కూడిన డివిజన్ బెంచ్ ఎదుట బుధవారం వాదనలు కొనసాగా యి. పిల్ తరఫున సీనియర్ న్యాయవాది బృందా గోవర్ వాదిస్తూ.. సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ నివేదికను పరిశీలిస్తే ఎన్‌కౌంటర్‌లో పాల్గొ న్న పోలీసులు తప్పు చేశారని నిర్దారణ అయ్యిందన్నారు. 

నిందితులు మహమ్మద్ ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్‌కుమార్, చింతకుంట చెన్నకేశవులులో ముగ్గురు మైనర్లని, మైనర్లను జువనైల్ హోంకు పంపాలని, జైలుకు కాదని చెప్పారు. నిందితుల కుటుంబాల తరపు న్యాయవాది వాదిస్తూ.. బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం చెల్లించలేదని, పరిహారం ఇచ్చేందుకు ప్రభు త్వం నిరాకరించడం అన్యాయమని అన్నారు. 

ఒక్కో కుటుంబానికి రూ.కోటి చొప్పున పరిహారం చెల్లించేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ వాదనలు వినిపించేందు కు వారం రోజులు గడువు కావాలని ప్రభు త్వ ప్లీడర్ కోరడంపై హైకోర్టు మండిపడింది. మంగళవారం విచారణ ప్రారంభమైన వెం టనే వాయిదా కోరకుండా ఇప్పుడు వాయి దా కోరడం ఏమిటని విచారణను ఈ నెల 9వ తేదీకి వాయిదా వేసింది.