calender_icon.png 8 January, 2025 | 8:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హామీలు అమలు చేయాలన్నందుకే విచారణ

07-01-2025 01:21:54 AM

* మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఫైర్

హైదరాబాద్, జనవరి 6 (విజయక్రాం తి): ఇచ్చిన హామీలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని ఎవరైతే అడుగుతారో వారిని అరెస్టు చేయడమే రెండో పనిగా పెట్టుకున్నారని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. ఏడాది నుంచి హామీలు అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని, రైతు భరోసాపై మాట తప్పారని పేర్కొన్నారు.

ఎన్నికలకు ముందుకు రూ.15 వేలు ఇస్తామని, ఇప్పుడు రూ.12 వేలు అని ప్రకటించారని వెల్లడించారు. ఒక పంటకు రైతు భరోసా ఎగ్గొ టి రుణమాఫీ  40 శాతం మాత్రమే అమలు చేశారని, కల్యాణలక్ష్మితోపాటు తులం బం గారం జాడ లేదని మండిపడ్డారు.

ఇచ్చిన అనేక హామీలు అమలు చేయలేక అన్ని విషయాల్లో ప్రభుత్వం విఫలమయ్యిందని, అందు కే పాలకులు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. కేటీఆర్‌ను అరెస్ట్ చేయాలి, ఇబ్బంది పెట్టాలి, జైల్లో వేయాలని కుట్రలు పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.